Tuesday, April 13, 2021

నా పేరే ఒక బ్రాండ్ -బెజవాడలో అసలైన సింహాన్ని -వెల్లంపల్లి ఒంటినిండా మచ్చలే -జగన్ కబోది: జలీల్ ఖాన్

దుర్గగుడిలో ఉద్యోగులపై వేటు..

విజయవాడలో కొలువైన ప్రపంపచ ప్రఖ్యాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పలు విభాగాల్లో విచ్చలవిడిగా అవినీతి కలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఏసీబీ ఆధ్వర్యంలో గత వారం సోదాలు, దర్యాప్తు జరిగింది. తప్పులు చేసినట్లు తేలడంతో దుర్గగుడిలో ఆయా విభాగాలను పర్యవేక్షిస్తున్న ఏడుగురు సూపరింటెండెంట్లు, మరో ఎనిమిది మంది కిందిస్థాయి ఉద్యోగులపైన సస్పెన్షన్‌ వేటు పడింది. అయితే, వేటుకు గురైన వాళ్లంతా చిన్న చేపలు మాత్రమేనని, అసలైన అవినీతి తిమింగలం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే అని టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆరోపించారు. బుధవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో జలీల్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వెల్లంపల్లి, సీఎం జగన్ తీరుపై విమర్శలు చేస్తూ విజయవాడ ఘనతను వివరించారు. జలీల్ ఖాన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

 దేవాలయాల్లో దొంగతనాలు..

దేవాలయాల్లో దొంగతనాలు..

‘‘గుడిలో కొబ్బరికాయల నుంచి వెంట్రుకల దాకా దేన్నీ వదల కుండా ఆసాంతం దోపిడీ వ్యవహారాలు జరుగుతున్నాయి. వ్యాపారుల దగ్గర కమిషన్లు తీసుకుంటూ మంత్రి వెల్లంపల్లి ఈ తంతును నిర్వహిస్తున్నాడు. మంత్రి వేధింపులు తాళలేకపోతున్నామని ఎంతో మంది నాకు మొరపెట్టుకుంటున్నారు. అక్రమాలకు సంబంధించి చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. కానీ అసలైన దొంగ మంత్రే. వెల్లంపల్లి అక్రమాలు బహిరంగంగా సాగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కు కనబడదా? సీఎం గారు అసలు పేపర్ చూడరా? లేక సలహాదారులు ఇలాంటివేవీ చెప్పరా? ఒక్క దుర్గ గుడిలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ దోపిడీ పర్వం కొనసాగడానికి కారకుడు మంత్రి వెల్లంపల్లే. నిజానికి..

 ఆయన ఒంటినిండా మచ్చలే..

ఆయన ఒంటినిండా మచ్చలే..

ఒదిక్కు దేవుణ్ని అవమానిస్తూ, మరోదిక్కు భక్తుల మనోభావాలను గాయపరుస్తూ దేవాదాయ మంత్రి సాగిస్తోన్న అక్రమాలపై సీఎం వెంటనే స్పందించాలి. ఇలాంటి మంత్రులతో పాలన కరెక్టుకాదు. దుర్గగుడి ఈవోను తక్షణమే సస్పెండ్ చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఆలయాల్లో అవినీతిపై నేను గతంలో విసిరిన సవాళ్లకు వెల్లంపల్లి రియాక్ట్ అయ్యాడు. పందుల్లా గుంపులుగా రాబోనని, సింహంలా సింగిల్ గానే వస్తానని, అసలు ఒట్టు అనే మాటకు అర్థం తెలుసా? అని ఏవేవో కూతలు కూశాడు. నిజం చెప్పాలంటే మంత్రి ముఖం, నాలుక మీదేకాదు.. ఒంటి నిండా అవినీతి మచ్చలున్నాయి. కావాలంటే ప్రాక్టికల్ గా చూపిస్తా. నా నాలుక, శరీరం మాత్రం సాఫ్ గానే ఉన్నాయి..

 అసలైన సింహం నేనే..

అసలైన సింహం నేనే..

ఆలయాల్లో అవినీతి విషయంలో ఇప్పటికే చాలా సార్లు సవాలు చేశాను, మళ్లీ చేస్తున్నా.. తాను అవినీతికి పాల్పడలేదని మంత్రి ప్రమాణం చేయగలడా? వయసు, అనుభవం, బరువు.. ఏ విషయంలోనైనాసరే వెల్లంపల్లి నాముందు బచ్చానే. అందరికీ చెప్పుకున్నట్లు ఆయనేమీ సింహం కాదు. కోడిపుంజు కనిపిస్తే పారిపోయే నువ్వు సింహానివా? కాదు.. గ్రామ సింహానివి. విజయవాడ వెస్ట్ లో అసలైన సింహం నా రూపంలో ఉంది. అసలు జలీల్ ఖాన్ అంటేనే ఒక బ్రాండ్. నీలాగా వెధవవను కాను. పదవుల్ని అడ్డం పెట్టుకుని దర్గా భూములు కొట్టేయలేదు, ఆలయాల్లో అక్రమాలకు పాల్పడలేదు. అసలు..

వెల్లంపల్లి జేబులో పైసా ఉండదు..

వెల్లంపల్లి జేబులో పైసా ఉండదు..

దుర్గ గుడికి 30వేలు చందా ఇచ్చానని చెప్పుకునే వెల్లంపల్లికి అక్కడ నెలకు 3లక్షల అద్దెలు వచ్చే కాంప్లెక్సులు ఉన్నాయి. అసలాయన ఏనాడైనా దానాలు చేశాడా? బయటికొస్తే జేబులో రూపాయి లేకుండా.. వ్యాపారుల్ని ఐదు, పదివేలు అడుక్కొనే రకం. కాబట్టి, పిచ్చిమాటలు, వట్టి కోతలు మానేసి, ఇప్పటికైనా దేవుడికి క్షమాపణలు చెప్పాలి. మంత్రి వెల్లంపల్లిని జగన్ వెంటనే బర్తరఫ్ చేయాలి” అని టీడీపీ నేత జలీల్ ఖాన్ అన్నారు. తెలుగునాట రాజకీయాలకు కేంద్రంగా ఉన్న విజయవాడలో మీడియా అలెర్టుగా ఉంటుందని, హైదరాబాద్ లో మీడియా అంత షార్ప్ గా ఉండదని, విశాఖపట్నంలోనైతే అసలే ఉండదని, అలాంటి విశాఖపట్నంలో రాజధాని పెడతానని జగన్ చెప్పడం విచారకరమని జలీల్ ఖాన్ అన్నారు.


Source link

MORE Articles

Samsung Announces a Galaxy Unpacked Event on April 28 | Digital Trends

Samsung has announced its next Galaxy Unpacked event, where it will likely show off what’s next in its Galaxy product lines. This event...

Nvidia expects crippling GPU shortages to continue throughout 2021

If you’re waiting for the crippling graphics card shortage to loosen up before buying new hardware, well, you might be waiting for a...

Microsoft’s Surface Laptop 4 packs much faster Intel processors

Microsoft has unveiled the Surface Laptop 4.You’ll get faster 11th-gen Intel Core chips, but a familiar design and older AMD options.It’s available April...

Anker is making a $130 webcam as part of its new expansion to home office gear

Anker has announced a new webcam as part of its new AnkerWork line of home office gear. The new webcam, called...

शादीशुदा पुरुषों के लिए बड़े काम की चीज है मुनक्का, जानें इस्तेमाल का तरीका

नई दिल्ली: मुनक्का को आयुर्वेद में औषधीय गुणों का भंडार कहा गया है. ऐसा माना जाता है कि मुनक्का किशमिश की तुलना में...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe