టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వెంకీ మామ.. కామెడీ సినిమాలతోనే తన సత్తా చాటుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగాడు. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ దూసుకుపోతున్న వెంకీ మామ.. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. తను ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడానికి కారణం ఓ సౌత్ స్టార్ హీరో అంటూ వివరించాడు. ప్రస్తుతం వెంకటేష్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఇక వెంకటేష్.. ఓ సందర్భంగా మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహాల కారణంగానే ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యానని.. నా విజయాలకు మూల కారణం ఆయనే అంటూ వివరించాడు. మొదటి దశలో రజనీతో ఏర్పడిన అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ఆయన ఓసారి నాతో చెప్పిన మాటలు ఎంతగానో నాపై ప్రభావం చూపయంటూ వెంకటేష్ వివరించాడు. పోస్టర్లు, కటౌట్లు కాదు.. మంచి కథలు, మంచి సినిమాలు మీకు స్థిర స్థానాన్ని తెచ్చి పెడతాయని రజిని వివరించాడని.. ఆయన ఇచ్చిన ఆ సజెషన్ నాకు మంచి మార్గదర్శకంగా మారింది అంటూ వివరించాడు.
అప్పటినుంచి.. తన ప్రచారానికి పోస్టర్లకు, గ్లామర్‌కి దూరంగానే ఉంటూ.. కంటెంట్ పై దృష్టి పెడతానని.. అదే అలవాటుగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా తన రేంజ్ నిలుపుకోవచ్చని నమ్మకం ఏర్పడిందని వివరించాడు. సినిమా సక్సెస్ కంటే ప్రేక్షక హృదయాల్లో నిలిచే కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆధ్యాత్మికతపై కూడా విశ్వాసాన్ని ఉంచుతానని.. ఈ విషయంలో రజనీకాంత్ తో నాకు మంచి అనుబంధము ఉందని చెప్పుకొచ్చాడు. వ్యక్తిత్వ పరంగా ఆయన నుంచి వచ్చిన ఈ ప్రేరణ జీవితాంతం గుర్తుంచుకుంటానంటూ వెంకటేశ్ వివరించాడు. ప్రస్తుతం వెంకటేష్ అంతేకాదు రజనీపై ఈ రేంజ్ లో ప్రశంసలు కురిపించడంతో ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.