Tuesday, September 21, 2021

నిండుకుండలా నాగార్జున సాగర్… 14 గేట్లు ఎత్తివేత… కనువిందు చేస్తున్న దృశ్యం…

Telangana

oi-Srinivas Mittapalli

|

ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ డ్యామ్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ఇప్పటికే 585 అడగులకు ఆ నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు సాగర్ 14 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.

Usman Sagar and Hussain Sagar reservoirs were completely flooded due to the recent heavy rains

గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. నదిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది 20 రోజులు ముందుగానే ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవడం గమనార్హం. ఎగువన కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి,జూరాల,నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.

nagarjuna sagar dam crust gates lifted to release excess water due to heavy flow

ఈసారి పశ్చిమ కనుల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో.. ఇప్పటికీ ఆల్మట్టి డ్యామ్,నారాయణపూర్ డ్యామ్‌కు భారీగా వరద పోటెత్తుతూనే ఉంది. దీంతో ఆ నీటిని కిందకు వదులుతున్నారు. సాధారణంగా కృష్ణా నదికి ఈ స్థాయిలో వరద రావడం అరుదుగానే చెబుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉండటం.. ఆ స్థాయిలో నీటి లభ్యత లేక రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రాల నీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరే అవకాశం ఉంది.

అటు ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి శ్రీశైలం,నాగార్జునసాగర్,పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఆదివారం(అగస్టు 1) సాయంత్రం నాటికి 1లక్ష క్యూసెక్కులు,సోమవారం సాయంత్రం నాటికి సుమారు రూ.5లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ వరద నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.

English summary

Nagarjuna Sagar Reservoir 14 gates were lifted due to getting huge inflows of as much as 5,30,000 cusecs of flood water from upper stream Srisailam dam.


Source link

MORE Articles

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe