[ad_1]
Stock Market Closing 11 August 2023:
స్టాక్ మార్కెట్ల వరుస పతనానికి అడ్డుకట్ట పడటం లేదు. శుక్రవారమూ భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిఫ్టీ కీలకమైన సపోర్ట్ లెవల్స్‌ను బ్రేక్ చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు తగ్గి 19,428 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 365 పాయింట్లు తగ్గి 65,322 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి రూ.82.85 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,688 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,727 వద్ద మొదలైంది. 65,274 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 365 పాయింట్ల నష్టంతో 65,322 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,543 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,554 వద్ద ఓపెనైంది. 19,412 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,557 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 114 పాయింట్లు తగ్గి 19,428 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,568 వద్ద మొదలైంది. 44,120 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,571 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 342 పాయింట్లు తగ్గి 44,199 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, యూపీఎల్, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పతనం అయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.630 పెరిగి రూ.24,300 వద్ద ఉంది.
Also Read: కస్టమర్లకు భారీ షాక్, FD రేట్లను అడ్డంగా కత్తిరించిన 5 బ్యాంకులు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link