నిమ్మకాయని ఇలా తీసుకుంటే షుగర్ తగ్గుతుందట..

[ad_1]

నిజానికీ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నిమ్మకాయల్ని డయాబెటిస్ సూపర్ ఫుడ్‌ అని చెబుతుంది. ఆరెంజెస్ కూడా ADA సూపర్‌ఫుడ్ లిస్ట్‌లో ఉన్నాయి. నిమ్మకాయలు, నారింజల్లో కార్బోహైడ్రేట్స్ ఒకేలా ఉన్నాయి. నిమ్మకాయల్లో చక్కెర కూడా తక్కువగా ఉంటుంది.

​నిమ్మలోని పోషకాలు.

నిమ్మకాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ,సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కేలరీలు, 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2.8 గ్రాముల డైటరీ ఫైబర్, 0.3 గ్రాముల కొవ్వు, 1.1 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ, మీకు డయాబెటిస్ ఉంటే కొన్ని ఫుడ్స్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిమ్మరసం తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్‌ హెల్త్‌పై ఎలా ఎఫెక్ట్ ఉంటుందో చూద్దాం.

Also Read : Neck Pain : మెడనొప్పి ఇలా వస్తే డేంజర్.. జాగ్రత్త..

​గ్లైసెమిక్ ఇండెక్స్, నిమ్మకాయలు..

గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతుంది. ఇది 0 నుండి 100 వరకూ స్కేల్‌లో కొలుస్తారు. 100 స్వచ్ఛమైన గ్లూకోజ్.

నిమ్మరసం అనేది ఎక్కవ జీఐ ఫుడ్‌తో కలిపి తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ చక్కెరగా మారడాన్ని నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీఐ తగ్గుతుంది.

సిట్రస్ ఫ్రూట్ ఫైబర్ అనేది శరీరానికి చాలా అవసరం. ఇది జ్యూస్‌లా కాకుండా మొత్తం పండలని తీసుకోవడం ఉత్తమం. మీరు పండు తిన్నప్పుడు పండులోని ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ మీ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణణి నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సాయపడుతుంది.

Also Read : Migraine : ఈ ఆసనాలతో మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గుతుందట..

​అధిక బరువుతో షుగర్..

సిట్రస్, ఓవర్ వెయిట్ 2013 అధ్యయనం ప్రకారం, సిట్రస్ ఫ్రూట్స్‌లోని బయోయాక్టివ్ భాగాలు అధికబరువు నివారణ, ట్రీట్‌మెంట్‌కి హెల్ప్ చేస్తాయి.

రక్తంలో చక్కెరను తగ్గించేందుకు ఇన్సులిన్‌ని సరిగ్గా ఉపయోగించే శరీర సామర్థ్యంపై అదనపు ఒత్తిడి ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారికి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది.

విటమిన్ సి, షుగర్ మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, విటమిన్ సి షుగర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆధారాలు చెబుతున్నాయి.

Also Read : Mattress : కొత్త పరుపులు కొంటున్నారా.. వీటిని మరువొద్దు..

​నిమ్మకాయల సైడ్ ఎఫెక్ట్స్..

నిమ్మకాయలు, నిమ్మరసం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిమ్మరసం ఆమ్లంగా ఉంటుంది కాబట్టి, దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.

నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట వస్తుంది

ఎక్కువగా నిమ్మరసం తీసుకుంటే మూత్రవిసర్జన అవుతుంది

నిమ్మతొక్కలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి అధికంగా కాల్షియం ఆక్సలేట్ మూత్రపిండాల్లో దారితీస్తాయి.

మీరు ఏవైనా తేలికపాటి సైడ్‌ఎఫెక్ట్స్‌ని ఎదుర్కొంటే నిమ్మకాయ, రసాన్ని తగ్గించండి. డాక్టర్‌ని కలిసి పరిష్కారం తీసుకోండి.

మరీ ముఖ్యంగా మీరు ఆహారంలో ఏ మార్పులు చేయాలనుకున్నా ముందుగా డాక్టర్‌ని కలిసి వారి సలహాలు తీసుకోవడం ముఖ్యమని మరువొద్దు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *