Tuesday, August 3, 2021

నిరుద్యోగంలో దక్షిణాదిలోనే ఏపీ టాప్… వైసీపీ మోసపూరిత హామీలతో రోడ్ల మీదకు యువత : చంద్రబాబు

Andhra Pradesh

oi-Srinivas Mittapalli

|

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ నిరుద్యోగం ఉందన్నారు. సుమారు కోటి మంది కరోనా కారణంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 2.3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. వైసీపీ నేతల మోసపూరిత హామీల కారణంగా యువత రోడ్ల మీదకు వస్తోందన్నారు. సోమవారం(జూన్ 21) పార్టీ సీనియర్ నేతలతో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

రైతులకు చెల్లించాల్సిన రూ.3600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, రైతులు చేసే ఉత్పత్తులన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో ఆస్తి పన్ను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

కరోనాను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు.రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.10వేలు చొప్పున సాయం అందించాలన్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తన దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇన్‌చార్జిలు నిరసన దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది జాబ్ క్యాలెండర్ కాదని… డాబు క్యాలెండర్ అని టీడీపీ విమర్శిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ముంచారని మండిపడుతోంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విద్యార్థి సంఘాలు సైతం ఈ జాబ్ క్యాలెండర్‌పై నిరసన వ్యక్తం చేశాయి. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.ఆర్టీసీని విలీనం చేసి 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడమేంటని ప్రశ్నించారు.గౌరవవేతనం కింద పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారని నిలదీశారు.వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

English summary

TDP chief Chandrababu Naidu said unemployment had risen in Andhra Pradesh. Andhra Pradesh has the highest unemployment rate in the south. About one crore people are said to have lost their job and employment opportunities due to corona.

Story first published: Tuesday, June 22, 2021, 0:13 [IST]


Source link

MORE Articles

Fleet your last Fleet — The Twitter feature vanishes today – TechCrunch

You don’t know what you’ve got ’til it’s gone. After a fittingly fleeting time in the wild, Twitter is banishing its ephemeral stories feature...

Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for ~$48M (Laurel Deppen/GeekWire)

Laurel Deppen / GeekWire: Hootsuite says it has acquired Montreal-based conversational AI startup Heyday, which offers a unified messaging platform for retailers, for...

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe