Monday, November 29, 2021

నిర్మల్‌లో రికార్డు స్థాయి వర్షం-గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్-ప్రతీ మున్సిపల్ అధికారి విధుల్లో ఉండేలా

నిర్మల్‌లో రికార్డు స్థాయిలో వర్షం…

తెలంగాణ వ్యాప్తంగా 44.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవగా… ఆదిలాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్య‌ధికంగా 115.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఒక్క నిర్మ‌ల్ జిల్లాలోనే 204 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవగా… జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ జిల్లాలో 474.3మి.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ చరిత్రలోనే ఇంత భారీ వర్షపాతం మునుపెన్నడూ లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు.

ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్,సీఎస్

ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్,సీఎస్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం,అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్,చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. . భారీ వర్షాల కారణంగా గోదావరి,కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందునా.. ఆ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలకు సీఎం ఆదేశించారు.ఆ ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు,మంత్రులు,అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

కేటీఆర్ కీలక ఆదేశాలు...

కేటీఆర్ కీలక ఆదేశాలు…

నిర్మల్‌లో స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గేంతవరకూ మున్సిపల్ శాఖలో ప్రతీ అధికారి విధుల్లో అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

గోదావరి ప్రాంతాల్లో హైఅలర్ట్...

గోదావరి ప్రాంతాల్లో హైఅలర్ట్…

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గోదావరి జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్,వరంగల్,ఖమ్మం జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించారు.ఎక్కడా ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, వరద ఉధృతి తీవ్రమయ్యే సూచనలు ఉంటే ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. తాగునీటికి,విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

శ్రీరాం సాగర్ గేట్లు ఎత్తివేత

శ్రీరాం సాగర్ గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గోదావరి నదిపై ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 1091 అడుగులు కాగా… ఇప్పటికే 1090 అడుగులకు నీటి మట్టం చేరింది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 84.810 టీఎంసీల నీరు ఉంది.దీంతో నీటిని దిగువకు విడుదల చేసేందుకు 8 గేట్లు ఎత్తివేశారు. దిగువకు 50వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,32,325 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


Source link

MORE Articles

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Sony’s impressive WF-1000XM4 earbuds fall to a new all-time low of $218 | Engadget

All products recommended by Engadget are selected by our editorial team, independent of our parent company. Some of our stories include affiliate links....

Benefits of raisin water: इस वक्त करें किशमिश पानी का सेवन, मिलेंगे जबरदस्त लाभ…

Benefits of raisin water Raisin water gives many benefits for health brmp | Benefits of raisin water: इस वक्त करें किशमिश पानी का...

Suzuki Avenis కొత్త వీడియో వచ్చేసింది.. చూసారా..!!

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) విడుదల చేసిన ఈ వీడియోలో సుజుకి అవెనిస్ 125 యొక్క స్టైలింగ్ మరియు ఆధునిక ఫీచర్స్ వంటి వాటిని చూడవచ్చు. ఈ స్కూటర్...

Lady: బిడ్డను రూ. 2. 50 లక్షలకు అమ్మేసిన తల్లి, గంటలోనే డబ్బు లాక్కెళ్లారని ?, థ్రిల్లర్ సినిమా, మైండ్ బ్లాక్

భర్తతో విడిపోయిన భార్య చెన్నై సిటీలోని పుఝల్ ప్రాంతంలోని కవంకరైయ్యన్ ప్రాంతంలో యాస్మిన్ (29) అనే మహిళ నివాసం ఉంటున్నది. 11 సంవత్సరాల క్రితం యాస్మిన్ మోహన్ అనే...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe