Tuesday, May 17, 2022

నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?

మిడ్ వీక్ మ్యాటర్స్..

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీ పట్టాపొందిన పరకాల ప్రభాకర్.. డేటా సైన్స్, పొలిటికల్ అనాలసిస్, డిజిటల్ మార్కెటింగ్ లోనూ రాణించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన ప్రజారాజ్యం పార్టీలో ముఖ్యుడిగా, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి సలహాదారుడిగా వ్యవహరించిన పరకాల.. గడిచిన రెండేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై అప్పుడప్పుడూ తన వాణిని వినిపిస్తోన్న ఆయన.. తాజాగా ‘మిడ్ వీక్ మ్యాటర్స్’ పేరుతో వీడియో కాలమ్ మొదలుపెట్టారు. తన పేరుతోనే నడిచే యూట్యూబ్ ఛానల్ లో ప్రతి బుధవారం ‘మిడ్ వీక్ మ్యాటర్స్’ వీడియోలను పోస్ట్ చేస్తంటారు. అందులో భాగంగా ఇవాళ(మార్చి 3న) ‘మోతేరా స్టేడియానికి మోదీ పేరు’ అంశంపై పరకాల తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందులో..

 మోదీ అంధ భక్తులకూ షాక్

మోదీ అంధ భక్తులకూ షాక్

తన వీడియో కాలమ్ ‘మిడ్ వీక్స్ మ్యాటర్స్’లో పరకాల తాజాగా ‘‘Narendra Modi Vs Sardar Patel : The Renaming Game” శీర్షికతో మోతేరా స్టేడియం పేరు మార్పు అంశంపై విశ్లేషణ చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పెద్దల తీరును తీవ్రంగా ఎడగడుతూ, దేశ భవిష్యత్తు ముఖచిత్రంపై పరకాల ఆందోళన వ్యక్తం చేశారు. అసలు పేర్ల మార్పిడి సంస్కృతి ఎందుకు పుట్టుకొచ్చిందో, ప్రస్తుత బీజేపీ ఆ పనిని ఎంత వికారంగా సాగిస్తున్నదో, రాజకీయంగా ఈ చర్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? తదితర అంశాలపై ప్రభాకర్ కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు. మోతేరా స్టేడియానికి సర్దార్ పటేల్ పేరును తొలగించి, నరేంద్ర మోదీ పేరు పెట్టడం.. బీజేపీ, మోదీ అంధభక్తులను సైతం షాక్ కు గురిచేసిందని వ్యాఖ్యానించారు. తాజా కాలమ్ లో పరకాల ప్రభాకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

చివరి నిమిషం దాకా రహస్యంగా..

చివరి నిమిషం దాకా రహస్యంగా..

‘‘ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్ లో కొలువైన మోతేరా స్టేడియానికి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పేరును తొలగించి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడాన్ని విని.. దేశ ప్రజలందరిలాగే నేను కూడా ఆశ్చర్యపోయాను. చివరి నిమిషం దాకా ఆ వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. మోతేరాకు అనుబంధంగా కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ శంకుస్థాపనకు నిర్దేశించిన ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ బాధ్యుడు జైషా సమక్షంలో సడెన్ గా పేరు మార్పును ప్రకటించారు. ఆ దెబ్బతో పలేట్ వారసులమని చెప్పుకునే అర్హతను బీజేపీ కోల్పోయిందనే చెప్పాలి. పటేల్ పేరుతో కొత్త కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, మోతేరాకు మోదీ పేరు పెట్టడం పెద్ద మ్యాటరే కాదన్నట్లు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడటం నష్టనివారణ చర్యలో భాగమే. కాగా,

 పేరు మార్పిడి లాజిక్ ఇదే..

పేరు మార్పిడి లాజిక్ ఇదే..

మోతేరా స్టేడియానికి బతికున్న ప్రధాని మోదీ పేరు పెట్టడం అనూహ్యమైతే, ఏకంగా సర్దార్ పటేల్ పేరును తొలగించడం ముమ్మాటికీ ప్రమాదకర సంకేతమే. బ్రిటిష్ వలస పాలన గుర్తుల్ని చెరిపేయడానికే పేర్ల మార్పిడి సంస్కృతి తెరపైకి వచ్చింది. కింగ్ జర్జ్ ఆస్పత్రిని కస్తూర్బా ఆస్పత్రిగా, విల్లింగ్టన్ ఆస్పత్రి రాంమనోహర్ లోహియా ఆస్పత్రిగా, ఇంపీరియల్ బ్యాంక్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చుకోవడం లాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మోతేరాకు మోదీ పేరును పెట్టడాన్ని సమర్థిస్తూ బీజేపీ నేతలు.. కాంగ్రెస్ పాలనలో వివిధ సంస్థలు, ప్రాంగణాలకు ‘గాంధీ-నెహ్రూ’ పేర్లు పెట్టడాన్ని ఉదహరించారు. అంటే, కాంగ్రెస్ చేసిన తప్పులను మేం కూడా చేస్తున్నామని బీజేపీ చెబుతోందా? ఇదెక్కడి లాజిక్? మోతేరాకు మహాత్మాగాంధీ పేరు పెట్టినా సరే, అడ్డగోలు పేరు మార్పిడిలు మంచి సంస్కృతి కానేకాదు. అసలు..

మోదీ ఎలా ఒప్పుకున్నాడు?

మోదీ ఎలా ఒప్పుకున్నాడు?

దేశంలో తిరుగులేని నాయకుడిగా, గుజరాతీలకు ప్రియుడిగా, రాజకీయంగా అసలు ఎదురంటూ లేని ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంత కుత్సితమైన(పేరు మార్పు) నిర్ణయానికి ఎలా అంగీకరించగలిగాడు? అందునా సర్దార్ పటేల్ పేరును తొలగించి, తన పేరు పెట్టుకోవడం ద్వారా తలెత్తే పరిణామాలను ఆయన అంచనా వేసి ఉండరని అనుకోలేం. ఒకవేళ ఇది మోదీకి తెలియకుండానో, ఉద్దేశపూర్వక తప్పిందమో అయి ఉంటే, దానిని దిద్దుకోగలిగిన సమర్థత, రాజకీయ చతురత మోదీకి ఉంది. గతంలో రూ.10లక్షల సూట్ ధరించినప్పుడు ఆ విమర్శల జడి నుంచి మోదీ ఎంత ఈజీగా గట్టెక్కాడో మనం చూశాం. కానీ పలేట్ పేరును తొలగించిన ఘటన మాత్రం చాలా పెద్ద విషయంగానే నేను భావిస్తున్నాను. తన పక్కనే ఉన్న వ్యక్తుల వల్ల అభద్రతా భావం తలెత్తిందా? అనే అనుమానాలు కూడా నాకున్నాయి. నిజానికి..

 కేసీఆర్, జగన్, చంద్రబాబు..

కేసీఆర్, జగన్, చంద్రబాబు..

చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు తమ పేర్లతో పథకాలు చేపట్టడం జరుగుతున్నదే. తమిళనాడులో అమ్మ పేరుతో, ఏపీలో చంద్రన్న, జగనన్న పేర్లతో, తెలంగాణలో కేసీఆర్ పేరుతోనూ పథకాలున్నాయి. అయితే, జాతీయ స్థాయిలో ఒక ప్రధాని తన పదవీకాలంలో ఇలా వ్యవహరించడం బహుశా ఇదే తొలిసారి. మోదీ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటే అంతకంటే పెద్ద విషాదం ఉండదు. తన అమరత్వాన్ని మోదీ ఈ విధంగా స్థిరీకరించాలనుకోవడం అర్థంలేని వ్యవహారం. ఎందుకంటే, నిజంగా మంచి పనులు చేసిన వాళ్లను పదవుల్లో నుంచి దిగిపోయినా, ఈ లోకం నుంచి వెళ్లిపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అంతేతప్ప స్టేడియాలకు పేర్లు పెట్టుకుంటేనే శాశ్వతత్వం వస్తుందనుకోవడం భ్రమ. ఇవి..

నియంతృత్వానికి నాది ఇది..

నియంతృత్వానికి నాది ఇది..

2016లో నేను కజకిస్తాన్ రాజధాని ఆస్థానాకు వెళ్లే నాటికే ఆ పేరు ధ్వంసమైపోయి కొత్తగా ‘నూర్ సుల్తాన్’ పేరును సంతరించుకుంది. అది.. ఆ దేశ పాలకుడి పేరు. నేషనల్ సెక్యూరిటీ మొదలుకొని అన్ని పదవులనూ తన గుప్పిట్లో పెట్టుకున్న ఆ నేత.. దేశ రాజధానికి తన పేరు పెట్టుకోవడం అతిపెద్ద వ్యవహారం. అయితే, అలాంటి పెద్ద ఘటనలన్నీ చిన్న చిన్న చర్యలతోనే మొదలవుతాయన్నది నిజం. మోతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడం ముమ్మాటికీ అలాంటిదే. మారిన బీజేపీ తీరు చూశాక, ఇప్పుడు నా బాధంతా తెలుగురాష్ట్రాలవైపు మళ్ళింది. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ (ఎల్బీ) స్టేడియం, రవీంద్ర భారతి గురించి నాలో దిగులు మొదలైంది. స్వాతంత్ర్య యోధుడి పేరుతో ఉన్న ప్రకాశం జిల్లా పేరు పైనా నాలో భయం నెలకొంది. నాయకులు కానిది ఎవరు? సర్దార్ పటేల్ జనం గుండెల్లో ఉన్నారు. ఈ దేశ చరిత్రలో మమేకం అయ్యారు. కేవలం స్టేడియానికి పేరు వల్లనే ఆయన ఉండిపోలేదన్న సత్యాన్ని మోదీ, బీజేపీ పెద్దలు గ్రహించాలి” అని పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రధాని మోదీకి దగ్గరి వ్యక్తిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ భర్త పరకాల ఈరకమైన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe