Tuesday, April 13, 2021

నేడే బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: టీఆర్ఎస్-ఎంఐఎం, మధ్యలో బీజేపీ!

జీహెచ్ఎంసీ మేయర్ బరిలో బీజేపీ.. ఎందుకంటే..?

మరోవైపు 48 స్థానాలు దక్కించుకున్న బీజేపీ కూడా బరిలో నిలిచేందుకు మొగ్గుచూపుతోంది. 48 స్థానాల్లో ఓ కార్పొరేటర్ మరణించడంతో ఇప్పుడు బీజేపీ చేతిలో 47 కార్పొరేటర్ స్థానాలున్నాయి. తమకు పూర్తిస్థాయి బలం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మేయర్ ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటుగా వచ్చే వాహనాలను వేరే మార్గాల్లో దారి మళ్లించనున్నారు.

అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్.. కానీ..

అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్.. కానీ..

గత డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన 56 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఇక 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. పాతబస్తీలో మరోసారి పట్టు నిలుపుకున్న ఎంఐఎం 44 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతే కీలకం..

టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతే కీలకం..

జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 150 కాగా, కరోనాతో బీజేపీ కార్పొరేటర్ ఒకరు మృతి చెందారు. దీంతో ఆ సంఖ్య 149కి పడిపోయింది. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే వారిసంఖ్య 193కి చేరుతుంది. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్ 31 మంది, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్ కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కలిపిన టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం మద్దతు తప్పనిసరి అని విశ్లేషకులు అంటున్నారు. ఎంఐఎం బయటి నుంచి మద్దతిస్తుందా? లేక ఏదైనా పదవి అడుగుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. మరోవైపు మేయర్ ఎవరు అవుతారనేది కూడా ఉత్కంఠగా మారింది.


Source link

MORE Articles

Roof Of The World: तिब्बत के पठार पर Global Warming का खतरा, तापमान बढ़ने पर तेजी से पिघल रहे ग्लेशियर

बीजिंग: हाल ही में उत्तराखंड (Uttarakhand) में ग्लेशियर (Glacier) फटने से लगभग 80 लोगों की जान चली गई थी. हिमालय (Himalaya) पर मंडराते...

కబీరా హెర్మెస్ 75 హై-స్పీడ్ కమర్షియల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ధర, వివరాలు

కబీరా మొబిలిటీ కొత్తగా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తి అని, లాస్ట్ మైల్ డెలివరీ కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన...

పెళ్లి ఆపిన ‘బుల్లెట్’.. బైక్ కోసం వరుడి నానా యాగీ, గుర్రం దిగీ మరీ హంగామా..

డ్రెస్ విప్పేసి నానా హంగామా.. పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తుంటారు. కారు ఇస్తుంటారు. బంగారు గొలుసు పెడతాం అని చెబుతారు. వధువు తరపువారు మాట ఇస్తుంటారు....

पानी में भिगाकर ऐसे करें दालचीनी का इस्तेमाल, होंगे ये 6 फायदे

अगर दालचीनी के पानी का सही मात्रा सेवन किया जाए, तो महिलाओं खुद को कई गंभीर बीमारियों से बचा सकती हैं.  Source link

The Web Robots Pages

The Web Robots Pages Web Robots (also known as Web Wanderers, Crawlers, or Spiders), are programs that traverse the Web automatically. Search engines such as Google...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe