Sunday, July 25, 2021

పంచాయతీ ఎన్నికల వేళ… తూర్పు గోదావరిలో కత్తులతో దాడులు,ప్రకాశంలో ఉద్రిక్తత..

Updated: Tuesday, February 9, 2021, 10:08 [IST]

తొలి విడత పంచాయతీ ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లాలోని చినజగ్గంపేటలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కత్తులతో దాడులకు పాల్పడటంతో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ కార్యకర్తలు,ప్రత్యర్థులకు మధ్య గొడవలతో గ్రామం అట్టుడికింది. సోమవారం(ఫిబ్రవరి 8) రాత్రి కొంతమంది వైసీపీ నేతలు గ్రామంలో హల్‌చల్ చేశారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. స్థానిక వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మంగళవారం(ఫిబ్రవరి 9) ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కరోనా పేషెంట్లకు పీపీఈ కిట్లతో చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు.తొలి విడతలో విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. అయితే నోటా ఓట్లను లెక్కించబోమని అధికారులు ఇదివరకే వెల్లడించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది.

తొలివిడతలో మొత్తం 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఇందులో 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైంది. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలవలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన 2,723 చోట్ల సర్పంచ్, 20160 వార్డులకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. పోలింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.

Source link

MORE Articles

A look at the presence of crypto in hip-hop culture, beginning as early as 2013, including meme songs, rapper Nas's Coinbase investment, and illicit...

Ashwin Rodrigues / VICE: A look at the presence of crypto in hip-hop culture, beginning as early as 2013, including meme songs, rapper...

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe