పక్షవాతానికి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..

[ad_1]

వయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అందులో పక్షవాతం కూడా ఒకటి. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది కొంతమందిలో తక్కువ ప్రభావం చూపిత మరికొంతమందిలో తీవ్రంగా మారి వారిని మంచానికే పరిమితం చేస్తుంది. అలా కాకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఎలంటి జాగ్రత్తలు తీసుకోవాలో డా. మురళీ కృష్ణ చెబుతున్నారు. ఈయన హైదరాబాద్ మలక్ పేట్ కేర్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కారణాలు..

కారణాలు..

సాధారణంగా పక్షవాతం మెదడుకి అందాల్సిన రక్తం అందకపోవడం వల్ల వస్తుంది. దీనికి కారణం రక్తసరఫరా తగ్గడం, రక్తనాళాలు చిట్లిపోవడం. మెదడులోని కణాలు చనిపోయినప్పుడు కూడా పక్షవాతం వస్తుంది. దీనినే ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. దాదాపు 80 శాతం కేసులు ఇలానే ఉంటాయి.

దాదాపు శరీరంలో వచ్చే 98 శాతం ఆరోగ్య సమస్యలకి అధిక బరువే కారణం. ఈ అధిక బరువు సరైన జీవన శైలి లేకపోవడం, నిద్ర, ఆహారం విషయంలో అలసత్వం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ఈ కారణంగానే పక్షవాతం కూడా వస్తుంది.
Also Read : LeAlso Read : Leather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..ather sofa cleaning : లెదర్ సోఫాలను ఇలా క్లీన్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయ్..

లక్షణాలు

లక్షణాలు

పక్షవాతం లక్షణాలు అందరిలో ఒకేలా ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.

అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండా పోవడం
నోరు వంకరగా అవ్వడం
ముఖం ఓ వైపుగా ఉండడం
చూపు తగ్గడం
భరించలేని తలనొప్పి
తల తిరగడం
వాంతులు
నడవలేకపోవడం

ఈ లక్షణాల్లో అందరికీ అన్ని ఉండవు. వీటిలో దేనిని గుర్తించినా డాక్టర్ని వెంటనే సంప్రదించాలి.
Also Read : Heart attacks in Winter : గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

లక్షణాలు గుర్తించగానే..

లక్షణాలు గుర్తించగానే..

ముందుగా చెప్పినట్లుగా ఏ లక్షణాలు గమనించినా కూడా వెంటనే అంటే 3 గంటల్లోపే డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే మెదడులోని కణాలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా ఆ కణాలు తిరిగి బతకలేవు. కాబట్టి, పక్షవాతం వచ్చిన మొదటి 3 గంటల్లోపే హాస్పిటల్కి వెల్తే డాక్టర్స్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్(TPA) అనే ఇంజెక్షన్ ఇస్తారు. దీని వల్ల రక్తనాళాలు సరిగ్గా పనిచేసి మెదడుకి రక్త సరఫరాని అందిస్తాయి. యథావిధిగా మెదడుకి రక్తం సరఫరా అవుతుంది. ఈ TPA ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాదాపు 50 శాతం పేషెంట్స్ వెంటనే కాలు, చేయి పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా మారకుండా ఉంటుంది. త్వరగా కోలుకుంటారు. మూడుగంటల సమయం ఉంది కదా అని ఆలస్యం చేయొద్దు. ఎంత త్వరగా వీలైతే అంత ముందు ఈ ఇంజెక్షన్ చేయిస్తే త్వరగా కోలుకుంటారని డాక్టర్ చెబుతున్నారు.

ఇంజెక్షన్ చేసే ముందు..

ఇంజెక్షన్ చేసే ముందు..

పేషెంట్కి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేషన్ ఇంజెక్షన్ వేయించాలనుకున్నప్పుడు కచ్చితంగా అక్కడ సిటీ స్కాన్ ఉండాల్సిందే. దీంతోపాటు ఇరవై నాలుగు గంటలు న్యూరాలజిస్ట్ ఉండాలి. డాక్టర్ అనుభవంతో పాటు ఇంజక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. అందుకే అనుభవజ్ఞులైన ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయిన డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ని తీసుకెళ్ళడం మంచిది.
Also Read : Pregnancy Romance : ప్రెగ్నెన్సీ టైమ్లో ఇలా అనిపిస్తే శృంగారం చేయొద్దొట..

అవగాహన అవసరం..

అవగాహన అవసరం..

నిజానికి పాశ్చత్య దేశాల్లో పక్షవాతానికి ట్రీట్మెంట్ అనేది పదేళ్ళ క్రితం నుంచే అందుబాటులో ఉంది. మన దగ్గర కొద్దిమంది డాక్టర్లకే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ గురించి తెలుసు. దీంతో పేషెంట్స్ సరైన ట్రీట్మెంట్ పొందలేకపోతున్నాు. విదేశాల్లోలానే ఇక్కడ కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పక్షవాతానికి సంబంధించిన అవేర్నెస్ పెరగాలి.

ఖర్చు తక్కువే..

ఖర్చు తక్కువే..

అయితే, పక్షవాతానికి వేసే టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఖరీదు ఎక్కువ అని అనుకుంటారు. కానీ, దీనిని తీసుకోవడం వల్ల 50 శాతం మందికి పూర్తిగా సమస్య తగ్గుతుంది. దీంతో వారు తిరిగి తమ పని తాము చేసుకోగలరు. దీనికి అయ్యే ఖర్చు తక్కువే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరుగుతుంది. అయితే, ఇది కేవలం 4 నుంచి 7 శాతం మందిలో మాత్రమే జరుగుతుంది.

-Dr.Murali Krishna, Sr.Consultant Neurologist, CARE Hospitals Malakpet



గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *