Stock Market Opening 01 March 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం పరుగులు పెడుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. జీడీపీ గణాంకాలు విడుదల అవ్వడం, తయారీ రంగం స్థిరంగా ఉండటం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 104 పాయింట్లు పెరిగి 17,408 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 361 పాయింట్లు ఎగిసి 59,306 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ షేర్లు దూకుడుగా ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,926 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,136 వద్ద మొదలైంది. 59,109 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,370 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 361 పాయింట్ల లాభంతో 59,306 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,303 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,360 వద్ద ఓపెనైంది. 17,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,425 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 104 పాయింట్లు పెరిగి 17,408 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 40,473 వద్ద మొదలైంది. 40,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,622 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 286 పాయింట్లు పెరిగి 40,555 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, బ్రిటానియా, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు భారీగా లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today’s #StockTerm let’s look at what Liquidity is! Share if you found this post helpful. #NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #Liquidity pic.twitter.com/0oP8T3fVZp
— NSE India (@NSEIndia) February 28, 2023
Market Update for the day.
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/XcKc9tdaAN
— NSE India (@NSEIndia) February 28, 2023