పల్లీలు తింటే అలర్జీ వస్తుందా..

[ad_1]

సాధారణంగా 100 గ్రాముల పల్లీల్లో 567 కేలరీలు, 25 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా పల్లీల్లో ఫైబర్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. పల్లీల్లో కచ్చితంగా కొవ్వు శాతం ఉంటుంది. కానీ, మన ఫుడ్ నుండి ఈ పోషక దట్టమైన ఆహార పదార్థాన్ని వదిలేయడానికి ఇది కారణం కాదు.

​బరువు తగ్గడం..

ఈ వివరాలు చూసినట్లుగా వేరుశనగలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడతుంది. వేరుశనగలో ప్రోటీన్ మొత్తం కేలరీలలో దాదాపు 25 శాతం ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కి మంచి మూలం.

నట్స్‌లో ఉండే ఎక్కువ ప్రోటీన్, పీచు పదార్థం మనల్ని ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది. దీని ఫలితంగా మనం తక్కువ భాగాలను తీసుకుంటాం. అందువల్ల వారు ఓ వ్యక్తి బరువుని మెంటెయిన్ చేస్తారు.

Also Read : Heart problems : ఈ ఎక్సర్‌సైజెస్ గుండెకి చాలా మంచివట..

నిపుణులు ఏమంటున్నారంటే..

సీడ్స్ తినే వారు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కూడా వాటిని తినని వారి కంటే కాలక్రమేణా తక్కువ బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా సరే తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఇవే కాదు మిగతా ఫుడ విషయంలోనూ ఇలా ఉంటుంది.

Also Read : Pancreatic Cancer : లివర్ క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..

​జంక్ ఫుడ్‌కి బదులుగా..

పోషకాహార నిపుణులు జంక్, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి ప్రత్యామ్నాయంగా గింజలను తీసుకోవాలని చెప్పడంలో ఇవే కారణాలు.

చాలా మంది ఎక్కువ ధర ఉన్న నట్స్‌తో ఎక్కువ లాభాలు అని చెబుతారు. కానీ, ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఇండియాలో పల్లీలు ఎక్కువగా లభిస్తాయి. విదేశాల్లో దొరికే ఇతర నట్స్‌లానే ఇవి పోషకమైనవి. పల్లీల్లో లభించే పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

Also Read : Romance and zodiac signs : ఈ రాశివారు శృంగారానికి బానిసలుగా మారతారట..

​అలర్జీ వస్తుందా..

పల్లీలు తింటే అలర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఇది తీవ్రమైన అలర్జీలలో ఒకటిగా చెబుతారు. పల్లీల్లో అరాచిన్, కోనరాచిన్ అనే రెండు ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తినే వ్యక్తులకు కొన్ని సార్లు ప్రమాదంగా మారుతుంది.

అయితే, వీటిని తింటే అలర్జీలు రావడం కంటే.. తినేటప్పుడు మాత్రమే అలర్జీ ప్రతి చర్యలకు కారణమవుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *