పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?

Date:

Share post:


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్‌, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా రెమ్యున‌రేషన్ తీసుకుంటున్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. పవన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్‌ను చార్జ్‌ చేస్తుంది ఓ ప్రాంతీయ భాష సినిమా కోసమేనట. ఆ సినిమా మరేదో కాదు.. ఉస్తాద్‌ భగత్ సింగ్.

Ustaad Bhagat Singh First Glimpse | Pawan Kalyan | Sreeleela | Harish  Shankar | Devi Sri Prasad

హరీష్‌ శంకర్ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ రూపొందించ‌నున్న ఈ సినిమాపై అభిమానుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించి 20 శాతం షూటింగ్ టీం పూర్తి చేశారు. రెండు గ్లింప్స్‌ వీడియోలను సైతం రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్‌ను కలిసిన పవన్.. జులై నుంచి నాన్ స్టాప్ గా డేట్స్ ఇస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం పవన్ ఏకంగా రూ.172 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. అందులో రూ.50 కోట్లు అడ్వాన్స్‌గా ఇప్పటికే అందుకున్నాడట. ప్రాంతీయ భాష సినిమాకు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది ఆల్ టైం రికార్డ్ అనడంలో సందేహం లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇది మొదటిసారి.

Pawan Kalyan's Ustaad Bhagat Singh goes on floors, actor looks menacing in  new poster | Telugu News - The Indian Express

పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్, బన్ని, చరణ్, తారక సైతం రూ.100 కోట్లలో తీసుకుంటుంటే.. ఓ ప్రాంతీయ భాషా సినిమా కోసం నిర్మాత పవన్ కు ఈ రెంజ్ రెమ్యున‌రేష‌న్‌ ఇవ్వడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. అసలు సినిమా అంతలా ఎలా వర్కౌట్ అవుతుంది.. ప్రొడ్యూసర్ ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడని సందేహాలు అభిమానుల్లోనూ మొదలయ్యాయి. కేవలం తెలుగు వర్షన్‌గా వస్తున్నా ఈ సినిమా.. ఎంత బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచి బాక్స్ ఆఫీస్‌ బ్లాస్ట్‌ చేసినా.. రూ.172 కోట్ల షేర్ వ‌సూళ్లు రావడమే అసాధ్యం. అలాంటిది ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా మొదట ప్రాంతీయ భాష సినిమాల భావించినా.. ఇప్పుడు స్టోరీని మరింత స్కోప్ పెంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారని అందుకే అంతలా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్‌. మరి నిర్మాతల ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో.. ఈ సినిమాలు ఆ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టి లాభాలు ఇస్తుందో లేదో చూడాలి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...