[ad_1]
హైదరాబాద్ లో బంగారం ధరలిలా
తాజాగా హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,000 గా ఉండగా, నేడు ఒక్కరోజే 700 రూపాయలు మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే ఈరోజు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 గా ఉండగా నేడు ఒక్కరోజే 770 రూపాయలు మేర బంగారం ధర తగ్గింది.
విజయవాడలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
ఇక విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,100 గా ఉంది. మొత్తం 700 రూపాయల మేర విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల విషయానికి వస్తే నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ఉంది. మొత్తం 770 రూపాయలు మేర 24 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది.
ఢిల్లీలో బంగారం ధరల స్థితి ఇలా
ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,550గా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 53,250 గా ఉండగా మొత్తం ఢిల్లీలోనూ 700 రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారంపై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 57,310 రూపాయల ధర పలుకుతుంది. ఈ ధర నిన్న 58,080 గా ఉండగా 770 రూపాయలు ధర తగ్గింది.
ముంబైలోనూ తగ్గిన బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈదర నిన్న 53,100గా ట్రేడ్ అయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ట్రేడ్ అయ్యింది.
చెన్నైలో అత్యధికంగా తగ్గిన బంగారం ధరలు .. నేడు ధరలిలా
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి చెన్నైలో 58,200 ధర ప్రస్తుతం పలుకుతుంది నిన్న ఈ ధర 59,070 గా ఉంది. చెన్నైలో అత్యధికంగా 870 రూపాయల మేర నేడు ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం చెన్నైలో నేడు 53,350లు పలుకుతుంది. ఈ ధర నిన్న 54,150 ఉంది. నిన్నటికి ఈరోజుకి 22 క్యారెట్ల మీద ఎనిమిది వందల రూపాయల మేర ధర తగ్గింది. దేశంలోనే చెన్నై, మధురై, కోయంబత్తూర్ తదితర నగరాలలో 60 వేల మార్కును దాటి బంగారం ధరలు పెరిగిన పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా దూకుడును కొనసాగించిన బంగారం ధరలు ప్రస్తుతం గణనీయంగా తగ్గడం గోల్డ్ లవర్స్ కు కాస్త ఊరట ఇస్తుంది.
[ad_2]
Source link