మళ్ళీ భగ్గుమంటున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ లను నమోదు చేయడానికి చేరువవుతున్నాయి. ఇప్పటికే రెండేళ్ల గరిష్టానికి చేరిన బంగారం ధరలు, మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగారం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. ఇక నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలలో ఆర్నమెంట్ బంగారానికి 10 గ్రాముల మీద 500 రూపాయలు, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారానికి 550 రూపాయల మేర ధర పెరగడం ప్రధానంగా కనిపిస్తుంది.

హైదరాబాద్లో బంగారం ధరల షాక్
దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,550 రూపాయలుగా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 58,420గా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం 53,550 రూపాయలుగా కొనసాగుతుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 58,420గా ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 53,050 రూపాయలు కాగా, నేడు 500 రూపాయలు మేర ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో నిన్న 57,870 రూపాయలకే ట్రేడ్ కాగా, నేడు ఆ ధర 550 రూపాయలు పెరిగింది. ఒక్కసారిగా భారీగా బంగారం ధర పెరగడం బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది.

ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో నేడు బంగారం ధరలు
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 58,570 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో 53,700గా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,550 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 58420 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,600 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బెంగుళూరులో 58,470 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖ, చెన్నైలలో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాలలో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 53,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 58,420 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. చెన్నైలో బంగారం ధర దేశంలోనే అధికంగా ఉంది. చెన్నై, కోయంబత్తూరు, మధురైలో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,250 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59 వేల 180 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది.