పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

Date:

Share post:


– Advertisement –

మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు స్థావరాల విధ్వంసం లక్ష్యంగా సైనిక చర్య ప్రారంభించాయి. పహల్గాంలో భారతీయ పర్యాటకులను అమానుషంగా బలిగొన్న హత్యాకాండకు ప్రతిస్పందన అవసరమన్న దానిపై దేశంలో విభిన్న దఅక్పథాలుగల అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వుంది. భారత ప్రభుత్వం, సైనిక దళాల ప్రతినిధులు సమర్పించిన సాక్ష్యాధారాలు లష్కరే తోయిబా దీని వెనక వుందని నిరూపించాయి. లష్కరేను పాకిస్తాన్‌ పాలక వ్యవస్థ నేరుగా నడిపిస్తుంటుంది. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే దాన్ని టెర్రరిస్టు సంస్థగా అధికారికంగా ప్రకటించింది.దేశంలో మతపరమైన విభజన రగిలించడానికే పహల్గాం దాడి జరిగిందని పత్రికా గోష్టిలో మాట్లాడిన విదేశాంగ కార్యదర్శి స్పష్టంగా పేర్కొన్నారు. అది నిజం. అలాంటప్పుడు భారత దేశపు ప్రధాన మీడియా, సోషల్‌ మీడియా ఈ కుట్రను గమనంలోకి తీసుకున్నాయా అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది.
మితవాద, మతవాద మీడియా సంస్థలలో అత్యధిక భాగం తమ పోస్టులలో, ప్రసారాలలో కాలకూట విషం కక్కుతున్న తీరు కూడా అందుకు ఏమీ తీసిపోయేలా లేదు. ఇంకా చెప్పాలంటే పహల్గాంలో టెర్రరిస్టు మారణకాండ సాగించిన వారిలాగే వీరు కూడా ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. కనుక కేవలం పైకి కనిపించడానికే గాక కచ్చితమైన చర్యలతో మనం ఈ మీడియావరణం వెదజల్లే విషానికి విరుగుడు తీసుకురావాలి. ఈ లక్ష్యం సాధించేందుకు భారత రాజ్యాంగంలో కావలసిన నిబంధనలున్నాయి. లక్ష్యాలను కచ్చితంగా నిర్దేశించుకుని పరిస్థితి మరింత ప్రజ్వలనకు దారితీయకుండా సైనిక చర్య జరిపినట్టు భారత పాలక వ్యవస్థ చెబుతున్నది. సమకాలీన ప్రపంచంలో ఒక పూర్తి స్థాయి సైనిక ఘర్షణ రాజకీయ భౌగోళిక ప్రభావాలు వినాశకరంగా వుంటాయనేది బాగా తెలిసిన విషయమే. కనుక మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఎందుకంటే ఈ విధమైన చర్యలు ఒకదానికొకటిగా దారితీసి మరింత రగులుకొనే ప్రమాదం ఎప్పుడూ వుంటుంది. అందుకు ఎలాంటి అవకాశమివ్వకుండా జాగ్రత్త పడాలి. వాటి ఉనికి లేకుండా చేయడమే ఇక్కడ లక్ష్యంగా వుండాలి.
పాకిస్తాన్‌ పాలక వ్యవస్థపై మరింతగా దౌత్యపరమైన రాజకీయమైన ఒత్తిడి తేవడానికి భారత దేశం మరింత విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు పోగు చేయాలి. పహల్గాం ఘాతుకానికి కారకులైన వారిని బోనెక్కించాలి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి టెర్రరిస్టు దాడులకు పాల్పడకుండా శిక్షలు పడేలా చూడాలి.అన్నిటినీ మించి ఇరు దేశాల ప్రజల సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం శాంతి సుస్థిరతలు కాపాడబడాలి. భారత దేశం బహుళత్వంతో కూడిన సమాజం. భిన్నత్వంలో ఏకత్వం దాని అతి పెద్ద బలం. దాన్ని అలాగే నిలబెట్టుకోవాలి. మన ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే చర్యలకు అసలు ఆస్కారం ఇవ్వరాదు. అస్తిత్వం ప్రాతిపదికన విద్వేషం పెంచే ధోరణులను అడ్డుకోవాలి.
(మే 7 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...