Tuesday, June 22, 2021

పాక్-భారత్ బంధం ఇంకాస్త తియ్యగా -చక్కెర, పత్తి, మరో 21 వస్తువులపై నిషేధం ఎత్తివేత -మోదీకి ఇమ్రాన్ లేఖ

చక్కెర, పత్తి, మరో 21వస్తువులు..

ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ నుంచి చక్కెర, పత్తి దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇండియ నుంచి దిగుమతుల ఆమోదానికి సంబంధించి పాకిస్థాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోట్‌ను తయారు చేయగా, క్యాబినెట్‌కు చెందిన ఎకనామిక్ కోఆర్టినేషన్ కమిటీ (ఈసీసీ) బుధవారం జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ప్రఖ్యాత ‘డాన్’ మీడియా పేర్కొంది. నిషేధం ఎత్తేసిన జాబితాలో చక్కెర, పత్తితోపాటు మరో 21 వస్తువులు కూడా ఉన్నాయిని తెలిపింది.

గండం నుంచి గట్టెక్కనున్న పాక్..

గండం నుంచి గట్టెక్కనున్న పాక్..

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి హమమద్ అజహర్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఎకనామిక్ కోఆర్టినేషన్ కమిటీ (ఈసీసీ).. ఇండో-పాక్ వాణిజ్యాన్ని పునఃప్రారంభించే ప్రతిపాదనకు ఆమోదం వేసింది. పాకిస్తాన్ లో వస్త్ర పరిశ్రమలో ముడి సరుకు కొరత ఉన్నందున పత్తి, దారం ఇండియా నుంచి దిగుమతి చేసుకోవాలని, దీనికి సంబంధించి దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా వస్త్రరంగానికి మేలు జరుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు.. వాణిజ్య, జౌళి మంత్రిత్వ ఇన్‌చార్జిగా కూడా ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సానుకూలత వ్యక్తం చేశారు. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశం గట్టెక్కడమే కాకుండా, భారత్‌లోని వస్త్రరంగానికి ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామం..

మోదీకి ఇమ్రాన్ రిప్లై లేఖ..

మోదీకి ఇమ్రాన్ రిప్లై లేఖ..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మన ప్రధాని మోదీకి లేఖ రాశారు. పాకిస్తాన్ డే సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల పాక్ ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. స్వేచ్ఛా, సామర్థ్యాలతో కూడిన స్వతంత్ర, సార్వభౌమ రాజ్యానికి ముందుచూపుతో పునాదులు వేసిన మా జాతి పితలను గుర్తు చేసుకుని, నివాళులు అర్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం…” అని పేర్కొన్నారు. అదే సమయంలో..

ప్రధానికి లేఖలో కాశ్మీర్ అంశం..

ప్రధానికి లేఖలో కాశ్మీర్ అంశం..

ఇండియాతో పాకిస్తాన్ కూడా స్నేహాన్నే కోరుకుంటోందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. పనిలోపనిగా జమ్మూకాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘భారత్ సహా పొరుగు దేశాలన్నిటితోనూ పాకిస్తాన్ ప్రజలు శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలు పరిష్కామైతేనే, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం అవుతాయి” అని ఇమ్రాన్ వక్కాణించారు. చర్చల ద్వారానే రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం ఏర్పడుతుందన్న ఇమ్రాన్.. కరోనా మహమ్మారిపై భారత ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారంటూ కితాబు ఇచ్చారు. త్వరలోనే..

 అమెరికా జోక్యం మేరకు భారత్, పాక్ దోస్తీ!

అమెరికా జోక్యం మేరకు భారత్, పాక్ దోస్తీ!

జోబైడెన్ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు, కూటములతో సంబధాలను పునరుద్ధరించే పనిని వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. అందులో భాగంగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌ విషయంలో బైడెన్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో భారత్, పాకిస్తాన్ లను భాగస్వాములుగా చేయాలనుకుంటోన్న అమెరికా.. ముందుగా దాయాదులు ఘర్షణ వీడాలని సూచించిందని, ఆ మేరకు యూఏఈ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ తిరిగి దగ్గరయ్యాయని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. అఫ్గానిస్థాన్‌లో ఇంటా బయటా శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందంటూ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఎమోమలీ రెహ్మాన్‌ తో భేటీ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలోనే భారత్, పాకిస్తాన్ రాయబార కార్యాలయాలను కూడా రీఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం.


Source link

MORE Articles

Clubhouse is building a DM text chat feature – TechCrunch

Some Clubhouse users were treated to a surprise feature in their favorite app, but it wasn’t long for this world. A new UI...

HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models; terms of the deal were...

Kyle Wiggers / VentureBeat: HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models;...

టీఆర్ఎస్‌లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు… హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం…

హుజురాబాద్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే -హరీశ్ రావు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని అన్నారు. 2001 నుంచి హుజురాబాద్‌...

हाई ब्लड प्रेशर को कंट्रोल में रखेंगी ये चीजें, हार्ट अटैक का खतरा भी होगा कम, डॉक्टर ने बताया सेवन करने का सही तरीका

नई दिल्ली: हार्ट अटैक एक ऐसी स्थिति है, जिसमें जान बचाना बेहद मुश्किल हो जाता है. इसकी सबसे बड़ी वजह अनियंत्रित हाई ब्लड...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe