పాతబస్తీ అగ్నిప్రమాదం..జగన్ దిగ్బ్రాంతి – Adya News Telugu

Date:

Share post:





పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వార్త విని తీవ్రంగా షాక్‌కు గురయ్యాను… తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు.

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని,మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించారు సీఎం. మంటల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడుతామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు సీఎం.

హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించిన ప్రధాని, గాయపడ్డ వారికి రూ.50,000 అందిస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






Previous articleపాన్‌కార్డు లేదా… అయితే!
Next articleటీడీపీ ఎంపీ..మైనింగ్ దోపిడి!




Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...