పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానానికి చివరి డెడ్‌లైన్ ఇదే, లేదంటే మీ PAN పనిచేయదు

[ad_1]

PAN Aadhaar Link Last Date:  పాన్‌ కార్డును ఆధార్‌‌తో అనుసంధానం చేసుకోవడంపై ఆదాయ పన్ను విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను శాఖ శనివారం సర్క్యూలర్ జారీ చేసింది. పాన్ – ఆధార్ అనుసంధానం గడువును ఐటీ శాఖ పలుమార్లు పొడిగించింది. కానీ ఈసారి మాత్రం, ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది.

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ కార్డుదారులు మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా పాన్ – ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే ఏప్రిల్ 1, 2023 నుంచి వారి పాన్ కార్డు పనిచేయదు అని పేర్కొంది. కనుక కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ లో లింక్ చేసుకోవాలని, లేకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని  ఆదాయపు పన్ను శాఖ శనివారం (డిసెంబర్ 24న) ఓ ప్రకటనలో పేర్కొంది.

News Reels

2023 మార్చి 31 వరకు తుది గడువు: ఐటీ శాఖ ట్విట్టర్

వచ్చే ఏడాది (2023) మార్చి 31వ తేదీ లోగా పాన్‌ – ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం చెబుతోంది. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్‌ – ఆధార్‌ అనుసంధానం తప్పనిసరని స్పష్టం చేసింది. మినహాయింపు వర్గంలోకి రాని వాళ్లంతా కచ్చితంగా పాన్‌- ఆధార్‌ లింకేజీ పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ఈసారి మిస్సయితే మాత్రం పాన్‌ కార్డు పనికి రాకుండా పోతుందని, అప్పుడు తాము కూడా ఏం చేయలేమని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. పాన్‌ – ఆధార్‌ లింకేజీ పూర్తి కాకపోతే, 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ‍ఆ పాన్ కార్డ్‌ ఇన్‌ఆపరేటివ్‌ (PAN Card Inactive)గా మారుతుందని ట్విటర్‌ తెలియజేసింది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి త్వరగా అనుసంధానం పూర్తి చేయండంటూ తన ట్వీట్‌లో ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *