PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పీవీఆర్‌-ఐనాక్స్‌ విలీనానికి ఒక లైన్‌ క్లియర్‌, ఓకే చెప్పిన NCLT బాంబే బెంచ్‌

[ad_1]

PVR-INOX Merger: భారత దేశ మల్టీప్లెక్స్ పరిశ్రమలో అతి పెద్ద మార్పునకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రెండు అతి పెద్ద మల్టీప్లెక్స్ చెయిన్స్‌ పీవీఆర్‌ & ఐనాక్స్ విలీనానికి రూట్‌ క్లియర్‌ అయింది. ఈ రెండు మల్టీప్లెక్స్ చైన్‌ల విలీనానికి గురువారం (12 జనవరి 2023) నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) బాంబే బెంచ్ ఆమోదం తెలిపింది. ట్రైబ్యునల్‌ రాతపూర్వక ఆదేశం 15 నుంచి 20 రోజుల్లో అందుతుందని భావిస్తున్నారు.

10 ఐనాక్స్‌ షేర్లకు గాను 3 పీవీఆర్‌ షేర్లను కేటాయించాలన్న విలీన నిష్పత్తికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. అయితే, కథ ఇక్కడితోనే అయిపోలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తర్వాత.. స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), షేర్ హోల్డర్లు కూడా ఈ విలీనాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ రెండు కంపెనీలు ఒకదాటి తర్వాత ఒకటిగా ఈ ఆమోదాలు పొందుతూ వస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అన్ని అనుమతులు పూర్తవుతాయని ఈ కంపెనీలు తెలిపాయి.

PVR & INOX Leisure విలీన ప్రతిపాదనను 2020 మార్చి 27న ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి. 

విలీనం తర్వాత అతి పెద్ద మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌
విలీనం తర్వాత ఆవిర్భవించే కొత్త సంస్థ, 1,500 పైగా స్క్రీన్‌ల నెట్‌వర్క్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా, అతి పెద్ద ఫిల్మ్ ఎగ్జిబిటర్‌గా అవతరిస్తుంది. PVR ఛైర్మన్ అజయ్ బిజ్లీ, వచ్చే ఐదేళ్లలో 3,000-4,000 స్క్రీన్‌లకు స్క్రీన్ కౌంట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

news reels

341 ప్రాపర్టీలు, 109 నగరాల్లో మొత్తం 1,546 స్క్రీన్‌లు విలీన కంపెనీ కిందకు వస్తాయి. ఇప్పటికే నిర్మించిన PVR, INOX థియేటర్లకు అవే పేర్లను కొనసాగిస్తారు, పేరు మార్చరు. విలీనం తర్వాత కొత్తగా నిర్మించే థియేటర్లను మాత్రం ‘PVR-INOX’ అనే ఉమ్మడి పేరుతో రన్‌ చేస్తారు.

4,000 స్క్రీన్‌ల లక్ష్యం
విలీనం తర్వాత, ఉమ్మడి కంపెనీ దేశవ్యాప్తంగా కొత్త స్క్రీన్‌లను ప్రారంభించి, స్క్రీన్‌ కౌంట్‌ను పెంచుతుందని PVR జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ చెప్పారు. ప్రస్తుతం 1,546గా ఉన్న సంఖ్యను 3,000 నుంచి 4,000 వరకు చేర్చడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని వెల్లడించారు. స్కీన్లను ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు పైగా పెంచాలన్న లక్ష్యాన్ని వచ్చే ఐదేళ్లలో సాధించాలని కంపెనీ యోచిస్తోంది. ప్లాన్‌లో భాగంగా… దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది కనీసం 200 నుంచి 250 కొత్త స్క్రీన్లను ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీంతో పాటు, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కూడా మల్టీప్లెక్స్‌లను స్థాపించి, తమ స్క్రీన్‌ల సంఖ్యను పెంచుతామని సంజీవ్ కుమార్ బిజ్లీ చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చిన్న పట్టణాల్లోనూ PVR-Inox మల్టీప్లెక్స్‌లు ప్రారంభిస్తామని వెల్లడించారు. 

ప్రస్తుతం.. భారతదేశంతో పాటు, శ్రీలంకలోనూ PVR వినోద వ్యాపారం చేస్తోంది. ఆ దేశంలో PVRకు మొత్తం 9 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి.

PVR & INOX Leisure కంపెనీలు BSEలో, NSEలో లిస్ట్‌ అయ్యాయి. కాబట్టి, ఈ విలీనానికి వాటాదారుల ఆమోదం పొందడం కూడా కూడా కీలకమే.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *