[ad_1]
పీసీఓడీ డైట్
మార్నింగ్ డ్రింక్..
ఉదయం పూట ఖాళీ కడుపుతో.. మెంతులు నానబెట్టిన నీరు తాగాలని డా. రషీమ్ మల్హోత్రా సూచించారు. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. మెంతులు శరీరంలో ఇన్సులిన్ విడుదలను ప్రోత్సహిస్తాయి. మీరు పీసీఓడీతో బాధపడుతుంటే.. రాత్రి పూట ఒక స్పూన్ మెంతి గింజలను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఫిల్టర్ చేసి ఆ నీళ్లు తాగండి.
బ్రెక్‌ఫాస్ట్‌లో..
బ్రెక్ఫాస్ట్లో ప్రొటీన్ – రిచ్ డైట్ తీసుకోవాలని డా. రషీమ్ మల్హోత్రా అన్నారు. ప్రొటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల.. రోజంతా ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా చురుగ్గా అన్ని పనులు చేసుకోవచ్చు. పెసలు, శెనగలు, బీన్స్, బఠానీ… స్ప్రౌట్స్తో తయారు చేసిన టిఫిన్ తీసుకుంటే.. మీ శరీరానికి ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది.
మిడ్ – మార్నింగ్ స్నాక్..
మిడ్-మార్నింగ్ స్నాక్లో మీకు నచ్చిన ఒక పండుతో 1 స్కూప్ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తినండి. జామ, కివి, యాపిల్, బొప్పాయి, నారింజ ఇలా పండైనా తినవచ్చు.
భోజనానికి ముందు..
భోజనానికి 30 నిమిషాల ముందు, ఒక ప్లేట్ నిండా మీకు ఇష్టమైన సలాడ్ తీసుకోండి. దానిలో నిమ్మరసం, అవిసె గింజల పొడి వేసుకుని తినడం మర్చిపోవద్దు.
మధ్యాహ్నం భోజనంలో..
మధ్యాహ్నం భోజనంలో గోధుమ పిండి, రాగి పిండితో తయారు చేసిన రోటీ తీసుకుంటే మంచిది. మీకు నచ్చిన కూరగాయలు, పప్పుతో రోటీని ఎంజాయ్ చేయండి.
ఈవెనింగ్ స్నాక్..
సాయంత్రం ఆకలిగా ఉంటే.. రెండు గుడ్ల తెల్ల సొన, స్ప్రౌట్స్ చాట్ వంటి హెల్తీ స్నాక్స్ తీసుకోండి. వీటితో పాటు 2 టీస్పూన్ల గుమ్మడికాయ గింజలను తినండి. వీటితో అల్లం, దాల్చిన చెక్క టీ తాగితే అద్భుతంగా ఉంటుంది.
డిన్నర్..
డిన్నర్లో క్యాలరీలు, కార్బ్స్ తక్కువగా ఉండే వేజిటెబుల్ సూప్ తీసుకోండి. దీనితో పాటు.. పప్పు కూడా తినండి. మీ పొట్టకు హెవీ అవ్వకుండా.. ప్రొటీన్ రిచ్ ఫుడ్ తినడం మంచిది.
బెడ్‌టైమ్ డ్రింక్..
రాత్రి నిద్రపోయే ముందు.. చామంతి టీ తాగండి. రాత్రి తిన్న ఆహారం జీర్ణం కావడానికి, పగటిపూట ఒత్తిడిని తగ్గించడానికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link