పుట్టుకతో గుండె లోపాలు ఎందుకు వస్తాయ్‌..?

[ad_1]

CHD Awareness Week: భారతదేశంలో ప్రతి ఏడాది 200,000 కంటే ఎక్కువ మంది పిల్లలు గుండె లోపాలతో పుడతున్నారు. వీరిలో దాదాపు 70,000 మంది చిన్నారులు తీవ్రమైన లోపంతో పుడుతున్నారు. అంటే, వీళ్లను కాపాడుకోవాలంటే.. కచ్చితంగా మొదటి సంవత్సరంలో చికిత్స చేయవలసి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20వేల మంది పిల్లలకు పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటున్నాయి. చిట్టి గుండెను కాపాడుకోవడానికి పుట్టుకతో వచ్చే గుండె లోపాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ నేపధ్యంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు పుట్టుకతో వచ్చే గుండె లోపాల వారోత్సవం నిర్వహిస్తున్నారు(Congenital Heart Defects(CHDs)). పసి పిల్లల్లో గుండె లోపాలనుకు కారణాలు ఏమిటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ? ఇప్పుడు తెలుసుకుందాం.

CHDs రకాలు..

chds-

అతి సున్నితమైన గుండె నిర్మాణం ఎంతో సంక్లిష్టమైంది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ స్టేజ్‌లో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి..

  • గుండెలో రంధ్రాలు (సెప్టల్‌ డిఫెక్ట్స్‌)
  • గదుల లోపాలు
  • రక్తనాళ సమస్యలు
  • వాల్వ్‌ సమస్యలు

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..
  • గుండెలో రంధ్రాలు ఏర్పడిన పిల్లల్లో ఆయాసం, తరచూ న్యుమోనియా బారినపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు పాలు కూడా సరిగ్గా తగలేరు. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతూ ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి.
  • చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి, ఒళ్లంతా విస్తరించటం వల్ల పెదాలు, వేళ్లు, గోర్లు, నాలుక వంటిని నీలంగా అవుతాయి.
  • కవాటాలు బిగుసుకుపోవటం, లీక్‌ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ ఎక్కువగా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండరు, ఆడుకోవడానికి అంతగా ఇట్రస్ట్‌ చూపరు.
  • నిద్రలేమి సమస్యతోనూ బాధపడుతుంటారు.
  • శ్వాస సరిగ్గా తీసుకోలేరు.

పుట్టిన తర్వాత ఈ టెస్ట్‌ చేయాలి..

పుట్టిన తర్వాత ఈ టెస్ట్‌ చేయాలి..

పసిపిల్లలు చురుకుగా లేకపోయినా, గోర్లు , నాలకు నీలంగా ఉంటే, పాలు సరిగ్గా తాగకపోయినా, శ్వాస వేగంా తీసుకుంటుంటే.. ఇవి పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు సంకేతాలు కావచ్చని డాక్టర్‌ స్వాతి గారేకర్ అన్నారు (DR Swati Garekar, Senior Pediatric Cardiologist, Fortis Pediatric Heart Care Team, Mulund). ఈ లక్షణాలు కనిపిస్తే.. ఎకో కార్డియోగ్రామ్ తప్పనిసరిగా చేయించాలని సూచించారు. విదేశాలలో పిల్లలు పుట్టిన తర్వాత.. ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను పల్స్ ఆక్సిమీటర్‌తో పరీక్షిస్తారని.. గుండె లోపాలు ఉంటే ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుందని అన్నారు. మన దేశంలోనూ ఈ పద్ధతిని అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

పుట్టుకతో గుండెలోపాలు ఎందుకు వస్తాయ్‌..

పుట్టుకతో గుండెలోపాలు ఎందుకు వస్తాయ్‌..

పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు ప్రధాన కారణమేమిటో కచ్చితమైన కారణం ఏమిటో పరిశోధనలలో ఇంకా తేలలేదు. కొన్ని పర్యావరణ మరియు జన్యుపరమైన ప్రమాద కారకాలు పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు కీలక పాత్ర పోషిస్తాయి . డాక్టర్‌ నీరజ్‌ అవస్థీ పుట్టుకతో గుండె లోపాలకు కారణాలను మనకు వివరించారు. ( Dr. Neeraj Awasthy, Director Pediatric Cardiology, Fortis Escorts) (Image source – pixabay)

జున్యుపరమైన కారణాలు..

జున్యుపరమైన కారణాలు..

జన్యుపరమైన కారణాల వల్ల పుట్టుకతో గుండె లోపాలు రావచ్చని నిపుణులు అంటున్నారు. కొందరికి జన్యు లోపాల వల్ల గుండె నిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్చు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు.. డౌన్‌ సిండ్రోమ్‌ జెనిటిక్‌ టెస్టింగ్‌ ద్వారా వీటని గుర్తించవచ్చు. (Image source – pixabay)

జర్మన్ మీజిల్స్ (రుబెల్లా)..

జర్మన్ మీజిల్స్ (రుబెల్లా)..

గర్భధారణ సమయంలో తల్లికి రుబెల్లా ఎఫెక్ట్‌ అయితే.. కడుపులోని శిశువు గుండె అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. తొలి మూడు నెలల్లో.. ముఖ్యంగా పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు గురైతే గుండె లోపాలకు కారణం అవుతుంది. (Image source – pixabay)

డయాబెటిస్‌..

డయాబెటిస్‌..

తల్లికి టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటిస్‌ ఉంటే.. శిశువు గుండె అభివృద్ధి చెందే విధానంపై ప్రభావం పడుతుంది. గర్భధారణ సమయంలో డయాబెటిస్‌ కారణంగానూ గుండెలోపాలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

కొన్ని మెడిసిన్స్‌ కారణంగా..

కొన్ని మెడిసిన్స్‌ కారణంగా..

గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకోవడం వల్ల పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, ఇతర పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడవచ్చు. బైపోలార్ డిజార్డర్‌కు వాడై.. లిథియం, మోటిమలు చికిత్సకు ఉపయోగించే ఐసోట్రిటినోయిన్ (క్లారవిస్, మైయోరిసన్, ఇతరులు) వంటి మెడిసిన్స్‌ వల్ల పసి పిల్లల్లో గుండె లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. (Image source – pixabay)

స్మోకింగ్‌, ఆల్కహాల్‌..

స్మోకింగ్‌, ఆల్కహాల్‌..

గర్భధారణ సమయంలో పొగ తాగటం, మద్యం తాగటం వంటి అలవాట్లతోనూ గుండె ఏర్పడే ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్ఛు ఇది లోపాలకు దారితీయొచ్చు. (Image source – pixabay)

పోషక లోపం..

పోషక లోపం..

గుండె లోపాల విషయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. గర్భం ధరించిన తొలినాళ్లలో పోషకాల లోపం.. ముఖ్యంగా ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండె లోపాలకు దారితీయొచ్చు. (Image source – pixabay)

మేనరిక వివాహాలు..

మేనరిక వివాహాలు..

మేనరిక పెళ్లి చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. మేనరిక వివాహాలు చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యిమందిలో 40-50 మందికి గుండె లోపాలు ఉండే అవకాశముంది. (Image source – pixabay)

95% కంటే ఎక్కువ కేసులు చికిత్స చేయవచ్చు..

95-

CHD వంశపారంపర్య వ్యాధి కాదని డాక్టర్ బ్రిజేష్ పి కొట్టాయ్ అన్నారు (Dr Brijesh P Kottayi, Associate Professor at the Department of C.V.T.S, Amrita Institute of Medical Sciences and Research Centre). 100 మంది పిల్లల్లో ఒకరు గుండె లోపంతో పుడుతున్నారని అన్నారు. ప్రస్తుతం 95% కంటే ఎక్కువ CHD కేసులు చికిత్స చేయవచ్చని పేర్కొన్నారు. . దాదాపు 50% క్లిష్టమైన కేసులకు ఒకే శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు, 25-30% కేసులకు బహుళ శస్త్రచికిత్సలు అవసరమవుతాయి స్పష్టం చేశారు. గుండె లోపంతో పుట్టిన పిల్లలలో దాదాపు 20% మందికి జీవితంలో మొదటి సంవత్సరంలోనే శస్త్రచికిత్స అవసరమవుతుందని చెప్పారు. ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడం, సమయానికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. మెడికల్ టెక్నాలజీలో పురోగతితో, CHDతో జన్మించిన చాలా మంది పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారని డాక్టర్‌ బ్రిజేష్ పి కొట్టాయ్ అన్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *