Tuesday, September 21, 2021

పెట్రోల్, గ్యాస్ ధరలు ఇంకా పెంచడానికే ఓటేయాలా? -బీజేపీపై మంత్రి హరీశ్ రావు ఫైర్

Telangana

oi-Madhu Kota

|

తెలంగాణలో గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇంధన ధరల భగభగలు ప్రచారాస్త్రాలుగా మారాయి. రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను ప్రస్తావిస్తూ… వాటిని ఇంకాస్త పెంచడానికే బీజేపీకి ఓటేయమంటారా? అని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా చేర్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. నోరుంది కదాని తెలంగాణ బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, వాళ్లకు నిజంగా దమ్ముంటే, చేతనయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో మాట్లాడాలని సవాలు విసిరారు.

telangana-mlc-elections-trs-minister-harish-rao-slams-bjp-over-petrol-and-gas-price-hike

కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని, ఇప్పటికే బీఎస్ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ”ఈతోటి బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపింది. అసలు వీళ్లకు ఓటెందుకు వేయాలి? ఉద్యోగాలు ఊడగొట్టినందుకా? లీటరు పెట్రోల్ రూ.100 చేసినందుకా? గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలు ఇంకా పెంచడానికా?” అని నిలదీశారు.

ఓవైపు ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముతూ, నిత్యావసర ధరల్ని ఇష్టారీతిగా పెంచేస్తోన్న బీజేపీ సర్కారు ఇక ఎరువుల ధర కూడా పెంచబోతోందని, యాసంగి నాటికే ఎరువుల ధర పెంచాలని కేంద్రం డిసైడైందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చారని, రాష్ట్రం కోసం కృషి చేశారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.


Source link

MORE Articles

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Apple iOS 15 cheat sheet: Everything you need to know

Get details about the new features of iOS 15, find out if it will work...

Microsoft Surface Duo 2 mini-tablet updated features revealed in FCC filing

Something to look forward to: As Microsoft prepares to talk about...

Astronomers finally solve the mystery of a famous 900-year-old Chinese supernova

A 900-year-old mystery has finally been solved as an international team of astronomers say they have identified the source of a famous supernova...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe