Friday, March 5, 2021

పెట్రో ధరల మంట- భారత్‌లో విచిత్ర పరిస్ధితి-మన ఎగుమతులే తిరిగి దేశంలోకి స్మగ్లింగ్‌

భారత్‌లో చమురు మంటలు

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఎడా పెడా పన్నులు బాదేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు అక్కడ పెరిగినప్పుడు దేశీయంగా తగ్గించకపోవడంతో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై కనికరం చూపేందుకు నిరాకరిస్తున్నాయి. పెట్రో ధరల పాపాన్ని అంతర్జాతీయ పరిస్ధితులపై నెట్టేసి హాయిగా కాలం గడిపేస్తున్నాయి. దీంతో సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా వెనక్కి తగ్గేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు..

ధరల మంటలోనూ ఆగని పెట్రో ఎగుమతులు

ధరల మంటలోనూ ఆగని పెట్రో ఎగుమతులు

అసలే పెట్రో ధరల మంటతో సగటు జనానికి చుక్కలు కనిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాలకు చమురు ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం ఆపడం లేదు. ఉల్లి పాయలు వంటి నిత్యవసర సరకుల ధరలు పెరగ్గానే విదేశాలకు ఎగుమతులు ఆపేసే కేంద్రం.. ఇప్పుడు పెట్రో ధరలు సెంచరీ దాటేసే పరిస్ధితులు వచ్చినా విదేశాలకు మాత్రం ఎగుమతులు ఆపడం లేదు. దీంతో పొరుగున ఉన్న నేపాల్‌కూ, అక్కడి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకకూ ఎగుమతులు యథావిధిగా సాగిపోతున్నాయి.

పెట్రో ఎగుమతులతో స్మగ్లింగ్‌ అవకాశం

పెట్రో ఎగుమతులతో స్మగ్లింగ్‌ అవకాశం

మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రో, గ్యాసోలిన్‌ ఉత్పత్తులను అక్కడ స్ధానిక పన్నులు తక్కువగా ఉండటంతో తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా అక్కడి అక్రమార్కులు రంగంలోకి దిగి వాటిని తక్కువ ధరకు కొనుక్కుని భారత్‌కు స్మగ్లింగ్‌ చేయడం మొదలుపెట్టేశారు. ఇలా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మన దేశంలోకి అవే ఉత్పత్తులు స్మగుల్‌ అయిపోతున్నాయి. తాజాగా నేపాల్‌లో సీజ్‌ చేసిన ఓ ఆయిల్ ట్యాంకర్‌లో 1360 లీటర్ల డీజిల్‌ను పట్టుకున్నారు. బీహార్ సరిహద్దుల్లో కేవలం రెండు మైళ్ల దూరం ప్రయాణిస్తే నేపాల్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ భారత్‌ కంటే తక్కువ ధరకే పెట్రోలు, డీజిల్‌ దొరుకుతోంది. దీంతో బీహార్‌ సరిహద్దుల్లో డిమాండ్‌ ఆ మేరకు పడిపోయింది.

అక్కడ రోడ్లపైనే పెట్రోల్‌ విక్రయాలు

అక్కడ రోడ్లపైనే పెట్రోల్‌ విక్రయాలు

ఇలా భారత్‌ ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులను తిరిగి దేశంలోకి అక్రమ రవాణా చేస్తున్న వారు దేశంలోకి వచ్చే రోడ్డు మార్గాల్లో రోడ్లపైనే వీటిని విక్రయించేస్తున్నారు. భారత్‌లో ఎక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్ కొనడం ఎందుకని వాహనదారులు కూడా వీరి వద్దే వాటిని కొనుగోలు చేసేస్తున్నారు. దీని వల్ల సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో భారీగా అమ్మకాలు పడిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సరిహద్దుల్లోకి వచ్చే రోడ్లపైన కూడా నిఘా పెంచాలని నిర్ణయించారు.


Source link

MORE Articles

What Is Magisk? How To Install Magisk And Root Android?

The open-source nature of Android OS has given rise to communities filled with Android enthusiasts. From Custom ROMs to various MODs; you name...

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ట్విస్ట్ .. స్కార్పియో యజమాని అనుమానాస్పద మృతి

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపుకు వాడిన స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ ది గా గుర్తింపు ఇటీవల ఆంటిలియా సమీపంలో జెలిటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో...

क्या आपको भी हो गया है कंप्यूटर विजन सिंड्रोम? इन लक्षणों से करें इस बीमारी की पहचान

नई दिल्ली: कंप्यूटर विजन सिंड्रोम- नाम सुनकर ऐसा लग रहा होगा कि यह कंप्यूटर पर अधिक देर तक काम करने की वजह से...

భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్

ఎన్‌ఐజె ప్రవేశపెట్టిన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్యూవి 60, అక్లేరియో మరియు ఫ్లియన్ అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ తో నడిచే స్కూటర్ల...

41 శాతం ఆదాయం రాష్ట్రాలకే.. పెట్రో ధరలపై కేంద్ర-రాష్ట్రాలు సమీక్షించాలి: నిర్మల

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతీ రోజు ఆయిల్ సంస్థలు ధరలు సమీక్షించి.. ఎంతో కొంత వాయిస్తోన్నాయి. దీంతో పెట్రో ధర సెంచరీ మార్క్‌నకు చేరువగా ఉంది. పెట్రో ధరలు.. పన్నులపై సోషల్ మీడియాలో...

मोटापे से परेशान लोग इस फल के छिलकों से बनी चाय का करें सेवन, मिलेंगे चमत्कारिक फायदे, जानें बनाने की विधि

नई दिल्ली: ज्यादातर लोग दिन की शुरूआत चाय की चुस्की के साथ करते हैं. कई बार दूध से बनी चाय का अधिक सेवन...

సోషల్‌ మీడియా, ఓటీటీల కొత్త మార్గదర్శకాలపై సుప్రీం ఫైర్‌- కఠిన చట్టాలకు కేంద్రం హామీ

దేశంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న సోషల్‌ మీడియా, ఓటీటీలకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే వీటి అమలుతో సోషల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదని అంతా భావిస్తున్నారు. ఇదే క్రమంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe