Monday, October 18, 2021

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు

తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో దూకుడుతో చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించిన వెంటనే టిఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ నిర్ణయాలను, దాని వెనుక ఉన్న ఆంతర్యం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి, టిఆర్ఎస్ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించి దళిత గిరిజన దండోరా సభలను నిర్వహిస్తూ అధికార పార్టీకి నిత్యం సవాళ్ళు విసురుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై కూడా పోరు బాట పట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేసి రాజకీయంగా మంత్రుల తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇక రేవంత్ రెడ్డి చేసే ఆరోపణలను డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ నేతలకు వచ్చింది.

మంత్రి కేటీఆర్ టార్గెట్ గా డ్రగ్స్ వ్యవహారంతో లింక్ పెట్టిన రేవంత్

మంత్రి కేటీఆర్ టార్గెట్ గా డ్రగ్స్ వ్యవహారంతో లింక్ పెట్టిన రేవంత్

ఇదే సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ కు రావడం, ఈడి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో సినీ ప్రముఖులను విచారిస్తుండటంతో, తాను కోర్టులో న్యాయ పోరాటం చేయడం వల్ల ఈడీ రంగంలోకి దిగిందని టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే .రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ దందా జరుగుతోందని, దాని వెనుక టిఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి .ఇక అంతే కాదు ఏకంగా మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాత కేటీఆర్ రహస్యంగా గోవా వెళ్లి వచ్చాడని ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని సంచలన ఆరోపణలు చేసి కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేశారు. ఇదే సమయంలో రానా, రకుల్ ప్రీత్ సింగ్ లను డ్రగ్స్ కేసు నుండి కాపాడడం వెనుక సీక్రెట్ మిత్రుడు ఎవరు అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

 గతానికి భిన్నంగా స్పందిస్తున్న కేటీఆర్

గతానికి భిన్నంగా స్పందిస్తున్న కేటీఆర్

గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పెద్దగా పట్టించుకోని కేటీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ తప్పుడు మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి పై దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు .అంతేకాదు తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి రెడీ అని అయితే రాహుల్ గాంధీ కూడా టెస్ట్ చేయించుకోవడానికి రెడీనా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. గతంలో ఎప్పుడూ కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను, వారు విసిరిన సవాళ్లను పెద్ద సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. అసలు కేటీఆర్ వైపు నుంచి రియాక్షన్ కూడా వచ్చేది కాదు. టిఆర్ఎస్ పార్టీ నేతలే ప్రతిపక్ష పార్టీ నేతలకు కౌంటర్ వేసేవారు.

 తెలంగాణలో పొలిటికల్ గేమ్ చేంజ్ .. కాంగ్రెస్ వ్యాహాత్మక దాడిలో డిఫెన్స్ లో కేటీఆర్

తెలంగాణలో పొలిటికల్ గేమ్ చేంజ్ .. కాంగ్రెస్ వ్యాహాత్మక దాడిలో డిఫెన్స్ లో కేటీఆర్

కానీ ఇటీవల కాలంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓ వైపు నుండి బీజేపీ రథసారథి బండి సంజయ్, మరో వైపు నుండి కాంగ్రెస్ రథసారథి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేటీఆర్ ను టార్గెట్ చేసి దాడి చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించాల్సి వస్తోంది. వివరణ ఇవ్వాల్సి వస్తోంది. తానేమీ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మకంగానే డ్రగ్స్ కేసులో తెలంగాణలో రాజకీయ అంశంగా మారుస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతేకాదు నిప్పు లేనిదే పొగ రాదనే చర్చకు కూడా కాంగ్రెస్ నేతలు ఆజ్యం పోశారు.

రేవంత్ మాత్రమే కాదు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డ్రగ్స్ అంటూ కేటీఆర్ పై మణిక్కం ఠాకూర్

రేవంత్ మాత్రమే కాదు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డ్రగ్స్ అంటూ కేటీఆర్ పై మణిక్కం ఠాకూర్

మొదటి నుంచి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును డ్రగ్స్ వ్యవహారంలో చేర్చి వ్యూహాత్మక దాడికి దిగారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మణిక్కం ఠాకూర్ కూడా కేటీఆర్ ను పరోక్షంగా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డ్రగ్స్ గా అభివర్ణిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేయడంతో కేటీఆర్ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కేటీఆర్ పరువునష్టం దావా వేసే దాకా వ్యవహారం నడిచింది.

 డ్రగ్స్ కేసులో కేటీఆర్ ను టార్గెట్ చెయ్యటం కాంగ్రెస్ కు మైలేజ్ తెస్తుందా ?

డ్రగ్స్ కేసులో కేటీఆర్ ను టార్గెట్ చెయ్యటం కాంగ్రెస్ కు మైలేజ్ తెస్తుందా ?

గతంలో ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి విమర్శలు చేసినా లైట్ తీసుకున్న కేటీఆర్, ఇప్పుడు కాస్త సీరియస్ గానే తీసుకోవాల్సి వస్తుంది. ఒకపక్క ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరిగేలా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పర్యటనలు, పాదయాత్రలు ఇబ్బంది పెడుతుంటే, మరోపక్క ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీ నేతలపై చేస్తున్న సంచలన ఆరోపణలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఏకంగా కేటీఆర్ ని టార్గెట్ చేసి డ్రగ్స్ వ్యవహారంతో లింకు పెట్టడంతో, కేటీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సవాల్ కు ప్రతి సవాల్ చేయడం, ట్వీట్లతో ఎదురు దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా డ్రగ్స్ కేసుతో కేటీఆర్ కు లింకు పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యూహాత్మక దాడి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మరింత మైలేజ్ తెస్తుందా ? లేక బూమరాంగ్ అవుతుందా? అన్నది భవిష్యత్తులో తేలనుంది.


Source link

MORE Articles

How the tech used to make giant, ultrahigh-precision mirrors and lenses for the James Webb Space Telescope was repurposed to develop displays for mobile...

Christopher Mims / Wall Street Journal: How the tech used to make giant, ultrahigh-precision mirrors and lenses for the James Webb Space Telescope...

OzTech: CBA gets machine learning to tackle abusive messaging; Smart city tally ranks 5 Australian cities; Australia and Finland to exchange supercomputer information

Commonwealth Bank gets machine learning to solve abusive messaging issuesEighteen months after finding a large number of abusive messages attached to customers’ transactions...

Amazon India’s brand team steals designs and artificially boosts its visibility in search results

A hot potato: Companies worldwide spend uncountable hours and dollars to...

Tinder Is Going to Help People Find Wedding Dates

Tinder isn't typically associated with marriage, but the company is looking to change that with a new feature called...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe