Tuesday, June 22, 2021

పోలవరం నిర్వాసితులపై మానవ హక్కుల ఉల్లంఘనలు: ఏపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు

నిర్వాసితుల పట్ల ఏపీ సర్కారు మానవ హక్కుల ఉల్లంఘన

పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి విద్యుత్ సరఫరా సహా ఇతర సదుపాయాలను నిలిపివేయడం గర్హనీయమని అన్నారు. పుట్టిపెరిగిన ఊళ్లను, జీవనోపాధిని, సాగుభూమిని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడం ఖచ్చితంగా మనావ హక్కుల ఉల్లంఘననేని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

నిర్వాసితులను అప్పుడే తరలించాలి..

నిర్వాసితులను అప్పుడే తరలించాలి..

తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కంటి తుడుపు కోసం నిర్వాసితులకు పట్టాలు ఇచ్చి ఊరి నుంచి పంపిస్తే వాళ్లు ఎక్కడ తలదాచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి అన్ని సదుపాయాలు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీయువకుడినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా చేసిన తర్వాతే తరలించాలని డిమాండ్ చేశారు.

నిర్వాసితులకు జగన్ ఏం సమాధానం చెబుతారంటూ పవన్

నిర్వాసితులకు జగన్ ఏం సమాధానం చెబుతారంటూ పవన్

పోలవరం, ముంపు బాధితులకు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీకింద రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన వైఎస్ జగన్.. ఇప్పుడు రూ. 6.8 లక్షలే ఇస్తున్నారని అంటున్న అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని పవన్ ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రజల బాధలను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేస్తున్నవారికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇళ్లను కూల్చివేస్తే ఎక్కడికిపోతారు?

ఇళ్లను కూల్చివేస్తే ఎక్కడికిపోతారు?

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎన్నో ఏళ్ల కల… ఈ ప్రాజెక్ట్ కోసం తాము పుట్టి జీవిస్తున్న ఊళ్లను, ఇళ్లను, పొలాలను త్యాగం చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా రోడ్డునపడవేయడం అత్యంత దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలలో ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించడంలో నిబంధనలను పక్కకుపెట్టి జేసీబీలు, పొక్లైనర్లతో బలవంతంగా ఇళ్లను కూల్చి వేసి మానవ హక్కులను ఉల్లంఘించారన్నారు. నిర్వాసితుల వద్దకు వెళ్లిన నాదెండ్ల మనోహర్ వారిని పరామర్శించారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. జనసేన అండగా ఉంటుందని వారికి చెప్పారు.


Source link

MORE Articles

వైఎస్సార్ చేయూత .. రెండో ఏడు కూడా , వైఎస్ జగన్ చేతుల మీదుగా పేద మహిళల అకౌంట్లలో నగదు జమ

నేడు రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అమలు ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద రెండవ ఏడాది...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : పీసీసీ పీఠం కోసం ఫైనల్ ఫైట్ : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ..!!

టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారం చివరి దశకు చేరుకుంది. కొంత కాలంగా సీరియల్ లా సాగిపోతున్న ఈ అంశం పైన తేల్చేయటానికి ఏఐసీసీ సిద్దమైంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా...

Sadist: భార్యను గొడ్డలితో ముక్కలుగా నరికి తందూర్ కాల్చినట్లు కాల్చేసిన భర్త, ఏం జరిగిందంటే ?

ఇస్లామాబాద్/కరాచి: వ్యాపారం చేస్తున్న భర్త ఇంట్లో భార్య, పిల్లలను సంతోషంగా చూసుకుంటున్నాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఓ విషయంలో అతని సంసారాన్ని సర్వనాశనం చేసింది. షాపులో జరిగిన ఓ సంఘటన వలన...

అమెరికాలో నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కలలు సాకారమవుతున్న వేళ విషాదం

వర్జీనియాలో ఆర్కిటెక్ట్‌గా సాయి ప్రవీణ్.. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు విద్యాశాఖలో అసిస్టెంట్...

క్షత్రియ సమాజం వార్నింగ్ వెనుక : నేటి పత్రికల్లో మంత్రి కౌంటర్ : సంచయిత అదే వర్గంగా ..దుమారం ఆగదా..!!

క్షత్రియ సమాజం పేరుతో ప్రకటనతో.. ఆ ప్రకటనలో ....రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవ‌న విధానాన్ని సాగిస్తున్న సామాజిక వ‌ర్గం క్ష‌త్రియ స‌మాజం. మాలో నూటికి...

The one developer that publicly agreed to try Facebook’s VR ads is already backing away

Last Wednesday, Facebook announced that it would begin testing ads inside of Oculus Quest apps and said that the paid title...

Clubhouse is building a DM text chat feature – TechCrunch

Some Clubhouse users were treated to a surprise feature in their favorite app, but it wasn’t long for this world. A new UI...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe