
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వారంతట వారు పాలించుకోలేరు కాబట్టి తమ తరపున ఒక వ్యక్తిని ప్రతినిధిగా చట్ట సభలకు పంపిస్తారు.
అది గ్రామంలో వార్డ్ మెంబర్, మండల స్థాయిలో mptc, జిల్లా స్థాయిలో zptc, నియోజకర్గస్థాయిలో ఎమ్మెల్యే/MLC, పార్లమెంట్ మెంబర్ ఇలా మా ప్రజల తరపున అవసరాలు తీర్చటానికి ఎన్నుకుంటాం.
వారు వారి వారి పరిధిలోని ప్రజల అవసరాలు తెలుసుకుని, ప్రభుత్వ ఉద్యోగుల (ప్రజలు కట్టే పన్నులతో పనిచేసే ప్రజల పనివారు(public servent) ద్వారా పనులు చేయించాలి.
కానీ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది మాత్రం తాము ఆకాశం నుండీ వూడి పడ్డట్లుగా ప్రజలను చీత్కరించుకుంటూ, నుంచోపెట్టి మాట్లాడతారు.
మన పన్ను డబ్బులతో వారు నెల నెలా జీతం తీసుకుంటూ, ఆఖర్న వారి కుటుంబ సభ్యుల తో సహా పెన్షన్లు, గ్రాట్యుటీ, ఇతర సౌకర్యాలు పొందుతూ,
మన పన్ను డబ్బులతో కొన్న కుర్చీలో కూడా మనల్ని కూర్చోనీయకుండా.(400/- విలువ చేసే కుర్చీ 750/- పెట్టి కొని, మిగతా డబ్బులు జేబులో వేసుకుని కూడా).
మన భాదలు పట్టించుకోని ఉద్యోగులే అధికం.
నేటి ప్రజలు కూడా “కొంతమంది” అవినీతికి పాల్పడుతూ ప్రజాస్వామ్యo లో అవినీతిపరులకు చోటిస్తున్నారు.
ఎలక్షన్లలో ఇచ్చే మందు, బిర్యానీ, 500/- to 2000/- కి తమ జీవితాలతో పాటు, చుట్టుప్రక్కల ఉన్న జనం జీవితాలు కూడా తాకట్టు పెట్టేస్తున్నారు.
ప్రభుత్వం నుండి వచ్చే ఉచితాలకు ఆశపడి, ఆ సొమ్ములు తిరిగి తమనుండే పన్నుల రూపంలో తిరిగి లాక్కుoటున్నారు అని తెలుసుకోలేక కొంతమంది ట్రాప్ లో పడుతున్నారు.
ఇప్పటికైనా ప్రజలు మేల్కొని కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి ని ఎన్నుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.