Stocks
lekhaka-Bhusarapu Pavani
Stock To Buy: చెప్పుల తయారీ సంస్థ రిలాక్సో ఫుట్‌వేర్ షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రిలాక్సో షేర్ ప్రతికూలంగా ట్రేడవుతోంది. మార్చి 13, 2023న స్టాక్ 52 వారాల కనిష్ఠానికి చేరుకోవడానికి ఇదే కారణం. ఈ దిగువ స్థాయి రూ.748.50గా ఉంది. అయితే నిపుణులు స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. బ్రోకరేజ్ షేర్‌ఖాన్‌కు స్టాక్‌పై BUY రేటింగ్ కొనసాగిస్తోంది.
రిలాక్సో ఫుట్‌వేర్ స్టాక్ టార్గెట్ ధరను బ్రోకరేజ్ షేర్ ఖాన్ రూ.930గా నిర్ణయించంది. ఈ స్టాక్‌కు రాబోయే సంవత్సరాల్లో బలమైన రికవరీని అంచనా వేసింది. ముడిసరుకు ధరల మెరుగుదలతో రాబోయే త్రైమాసికాల్లో మార్జిన్‌లో మెరుగుదల కొనసాగుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం స్టాక్ ధర రూ.760 వద్ద ట్రేడవుతోంది. గురువారం ట్రేడింగ్ సమయంలో స్టాక్ దాదాపు 1 శాతం మేర నష్టపోయింది. ఈ వారం మెుత్తం స్టాక్ ఒత్తిడిలోనే కొనసాగుతోంది. గడచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ ధర దాదాపుగా 34 శాతం మేర పడిపోయింది. ఆరు నెలల కాలంలో 30 శాతం, మూడు నెలల కాలంలో 18 శాతం, గడచిన నెలరోజుల్లో 17 శాతం వరకు స్టాక్ క్షీణతను నమోదు చేసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,301గా ఉంది. చివరగా ఏప్రిల్ 2022లో కంపెనీ షేర్లు ఈ స్థాయిని తాకాయి.
ఇటీవల విడుదలైన డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం తగ్గింది. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు 8.4 శాతం క్షీణించి రూ.681.03 కోట్లకు చేరుకుంది. దీంతో నికర లాభం రూ.30.10 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 57.06% తగ్గింది. డిసెంబర్ 2021లో 70.10 కోట్ల లాభం వచ్చింది. డిసెంబర్ 2022లో EBITDA రూ.76.67 కోట్లకు చేరుకోగా.. ఇది ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 39.68% తగ్గింది.
English summary
Brokerage sharekhan bullish over relaxo footware stock gave BUY rating know target price
Brokerage sharekhan bullish over relaxo footware stock gave BUY rating know target price..
Story first published: Thursday, March 16, 2023, 21:52 [IST]