Tuesday, August 3, 2021

ప్రభుత్వంలో ఇద్దరు, బయట మరో ఇద్దరీకే లాభం: వ్యవసాయ చట్టాలపై రాహుల్

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ వాయనాడు నియోజకవర్గంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. 100 ట్రాక్టర్లతో ర్యాలీ తీయగా.. వేలాది మంది రైతులు/ కూలీలు పాల్గొన్నారు. వాయనాడులో బఫర్ జోన్ ఎత్తేయాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రాక్టర్‌ను రాహుల్ గాంధీ నడుపుతుండగా ఎడమ పక్కన ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్, కుడి పక్కన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూర్చొన్నారు.

ముందు రాహుల్ ట్రాక్టర్ రాగా.. మిగతా వాహనాలు అతనిని అనుసరించాయి. రాహుల్ వెంట భద్రత సిబ్బంది పరుగెత్తారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ ర్యాలీ కొనసాగింది. చాలా మంది ప్రజలు రావడంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థిరికయిపట్టు నుంచి ముట్టిల్లి వరకు ర్యాలీ కొనసాగింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదీ అన్నదాతలను తీవ్రంగా నష్టానికి గురిచేస్తుందని రాహుల్ అన్నారు.

భారతీయ రైతుల ఇబ్బందులను యావత్ ప్రపంచం చూస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం మాత్రం చూడటం లేదని చెప్పారు. దేశంలో ఉన్న 40 శాతం రైతులను వ్యవసాయ చట్టాలు నిర్మూలిస్తాయని హెచ్చరించారు. కొత్త చట్టాలతో మోడీ స్నేహితులకే మేలు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వంలో ఇద్దరు (మోడీ, అమిత్ షా) బయట ఇద్దరు (అంబానీ, అదానీ) లాభపడుతున్నారని పేర్కొన్నారు. వారికే తప్ప అన్నదాతకు మేలు జరగడం లేదని వెల్లడించారు.


Source link

MORE Articles

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Benefit of banana health: रोज 1 केला सेहत के लिए कर सकता है कमाल, बस जान लीजिए सेवन का सही टाइम

benefit of banana health: आज हम आपके लिए केला के फायदे लेकर आए हैं. केला सबसे ज्यादा एनर्जी देने वाला फल है. खास...

Wife: అదే విషయంలో గొడవలు, ఏంచేస్తావు అని ఎదురు తిరిగిన భార్య, స్పాట్ లో చంపేసిన భర్త !

బెంగళూరులో కాపురం ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో సయ్యద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సయ్యద్, బేబి అయోషా అే...

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

మా ప్రభుత్వం రాగానే అంతకంత చూపిస్తాం అంటాడు బాబు తాజాగా చట్టం చేతికి చిక్కిన తన దొంగల ముఠా సభ్యులను వెనకేసుకు వస్తూ ప్రభుత్వంపై బాబు ఏమని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe