Friday, June 18, 2021

ప్రశ్నిస్తే పంపుతారా: ప్రొఫెసర్ ప్రతాప్ భానుకు ప్రపంచస్థాయి విద్యావేత్తల మద్దతు

National

oi-Kannaiah

|

ఢిల్లీ: రాజకీయ ఒత్తిళ్లతో అశోక యూనివర్శిటీకి చెందిన రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ప్రతాప్ భాన్ మెహతా రాజీనామా చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి యూనివర్శిటీలకు చెందిన విద్యావేత్తలు అండగా నిలిచారు. వీరిలో హార్వర్డ్, యేల్, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మరియు మసాచుషెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పలువురు విద్యావేత్తలు మద్దతుగా నిలిచిన వారిలో ఉన్నారు.

ప్రతాప్ భాను మెహతా రాజీనామాతో ఒక్కసారిగా హర్యానాలోని సోనీపత్‌లో ఉన్న అశోక యూనివర్శిటీ పేరు ఖండాంతరాలకు పాకింది. రెండేళ్ల క్రితం ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ పదవికి రాజీనామా చేసిన అశోక్ భాను మెహతా… ఇక ప్రొఫెసర్‌గా కూడా కొనసాగరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నట్లు తనపై వ్యవస్థాపకులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రొఫెసర్ పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతాప్ భాను మెహతాకు సంఘీభావంగా ఆర్థికశాఖ ముఖ్యసలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ కూడా రాజీనామా చేశారు. ప్రైవేట్ హోదా కింద ఉన్న అశోక యూనివర్శిటీలో కూడా విద్యా వ్యక్తీకరణ, మరియు స్వేచ్ఛ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు సుబ్రహ్మణ్యన్.

150 Academicians across the globe stand with Pratap Bhanu Mehta,says targetted for writings

భారత్‌లో వాక్‌స్వాతంత్ర్యంకు ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొంటూ అశోకా యూనివర్శిటీ ప్రొఫెసర్లుగా రాజీనామా చేసిన ప్రతాప్ భాను మెహతా, అరవింద్ సుబ్రహ్మణ్యంలకు సంఘీభాం తెలిపారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా 150 మంది విద్యావేత్తలు అశోక యూనివర్శిటీ ట్రస్టీలకు బహిరంగ లేఖ రాశారు. రాజకీయపరమైన కామెంట్స్ రాసినందుకే ప్రతాప్ భాను మెహతాను యాజమాన్యం లక్ష్యంగా చేసుకుని బయటకు వెళ్లేలా చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం విధానాలపై తన కాలమ్స్‌తో ప్రశ్నిస్తున్నందుకే ప్రతాప్ భాను మెహతా ను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ట్రస్టీలు ఈ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది పోయి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం పెట్టడం బాధాకరమని అన్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్లు మద్దతుగా నిలిచారు.


Source link

MORE Articles

Delivery service Gopuff acquires rideOS for $115 million – TechCrunch

On-demand goods, food and alcohol delivery service Gopuff has acquired fleet management platform rideOS for $115 million, sources familiar with the deal say. This...

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe