ప్రీ డ‌యాబెటిస్ రివర్స్‌ అవ్వడానికి.. డాక్టర్‌ టిప్స్‌

[ad_1]

Reverse Prediabetes: ‘డయాబెటిస్‌’ ఇది తీవ్రమైన సమస్య. డయాబెటిస్‌ ఒక్కసారి వస్తే.. దీన్ని కంట్రోల్‌ ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం కాదు. డయాబెటిస్‌ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే, డయాబెటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన తర్వాత తిప్పలు పడటం కంటే.. ఇది రాకుండా జాగ్రత్తపడటం మంచిది. షుగర్‌ పేషెంట్స్‌ ముందుగా ‘ప్రీ డయాబెటిక్’ దశను దాటే డయాబెటిక్‌గా మారుతారు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ అంటారు. అయితే మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని ప్రీ డ‌యాబెటిస్ అంటారు. ప‌ర‌గ‌డుపున షుగ‌ర్ టెస్టు చేయించుకుంటే ఆ లెవల్‌ 80 నుంచి 110 మ‌ధ్య రావాలి. కానీ 111 నుంచి 120 వ‌ర‌కు వ‌స్తే దాన్ని డయాబెటిస్‌ అని అనరు. షుగర్‌ లెవల్‌ బోర్డర్‌లో ప్రీ డ‌యాబెటిస్ అంటారు. అదే చాలా ఎక్కువ‌గా వ‌స్తే దాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఈ స్టేజిలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. నిర్ల‌క్ష్యం చేస్తే అది డ‌యాబెటిస్‌కు దారి తీసే అవ‌కాశం ఉంటుంది. చైనా ఆరోగ్య సంస్థ FHS నివేదిక ప్రకారం, ఆకలిగా ఉన్నప్పుడు.. రక్తంలో గ్లూకోజ్ 5.6-6.9 mmol/L ఉంటే, తిన్న రెండు గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 7.8-11.0 mmol/L ఉంటే ప్రీ డ‌యాబెటిస్ స్టేజ్‌లో ఉన్నారని అర్థం. ఈ స్టేజ్‌‌లో మంచి ఆహార అలవాట్లు లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా.. రాబోయే పదేళ్లలో టైప్ 2 డయాబెటిస్‌‌ వచ్చే ప్రమాదం ఉందని FHS స్పష్టం హెచ్చరించింది.
ఆయుర్వేదంలోని ఔషదాలు ప్రీ-డయాబెటిస్‌ను రివర్స్ చేయడానికి సహాయపడతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సార్‌ అన్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచి, ప్రీ-డయాబెటిస్‌ను రివర్స్‌ చేస్తాయని తెలిపారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ప్రీ-డయాబెటిస్‌

మెంతులు..

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతుల్లో ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, రాగి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీసుతో పాటు ఎ, బి6, సి, కె విటమిన్ల వంటి పోషకాలెన్నో ఉంటాయి. గ్లూకోజు మోతాదులు తగ్గటానికీ మెంతులు ఉపయోగపడతాయని భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక పేర్కొంటోంది. మెంతులలో నీటిలో కరిగే ఫైబర్‌ మెండుగా ఉంటుంది. మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్‌ అనే అమైనో ఆల్కనాయిక్‌ యాసిడ్‌ ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచటంతో పాటు కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించేలా చూస్తుంది. మెంతులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ ట్రైగ్లిజరైడ్‌లు కూడా తగ్గుతాయి. ప్రీ-డయాబెటిస్‌ ఉంటే రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి వాటిని వడగట్టి, నీళ్లు తాగొచ్చు. లేకపోతే వేడి నీటిలో 10 నిమిషాల సేపు మెంతులను వేసి మూతపెట్టి, తర్వాత వడగట్టి తాగొచ్చు. కావాలంటే మెంతులతో టీ కూడా కాచుకొని తీసుకోవచ్చు.

మిరియాలు..

ప్రపంచవ్యాప్తంగా వాడే ముఖ్యమైన మసాలా దినుసుల్లో మిరియాలది కీలక పాత్ర. ఇది వంటకాలకు ఘాటైన రుచిని ఇస్తుంది. మిరియాలు ఇన్సులిన్ అసహనం, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. మిరియాలలో ఉండే ‘పైపెరిన్’ రక్తంలో చక్కర స్థాయిలను కంట్రోల్‌ ఉంచుతాయి.శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను పైపరైన్‌ నిర్వీర్యం చేస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ కారణంగానూ డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రీ-డయాబెటిస్‌ ఉంటే ఒక నల్ల మిరియం పొడి చేసి, చిటికెడు పసుపులో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది. ఈ పొడిని పాలల్లో వేసి తీసుకున్నా మేలు జరుగుతుంది.

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కను మాంసాహార వంటల్లో రుచికి, సువాసనకు కచ్చితంగా వాడుతూ ఉంటారు. ఇది ఇన్సులిన్ అసహనాన్ని తగ్గిస్తుంది, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్పైక్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని హైడ్రాక్సీసినమాల్డిహైడ్ అనే కాంపౌండ్‌ రక్తంలోని హానికారక కొవ్వుల్ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క శరీరంలోని చెడు కొవ్వుల్ని క్రమంగా తగ్గించి, మంచి కొవ్వుల స్థాయిని పెంచుతుంది. అదనపు కొవ్వు మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక పాత్రలో కప్పు నీరు తీసుకుని దాన్ని మరిగించాలి. మరుగుతున్న నీటిలో రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని వేసి మళ్లీ మరిగించాలి. కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇలా తయారుచేసిన మిశ్రమాన్ని రోజూ పరగడుపున తీసుకుంటే మంచిది.

పసుపు, ఉసిరి..

పసుపు, ఉసిరి కాంబినేషన్‌ ప్రీ-డయాబెటిస్‌ త్వరగా రివర్స్‌ చేయడానికి సమర్థవంతంగా పని చేస్తుంది. ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా ఈ కాంబినేషన్‌ సూచిస్తారు. ఇది చక్కెర స్థాయిని సమతుల్యం. ఈ కాంబినేషన్‌ శరీరంలోని అదనపు కఫాన్ని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రీ-డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉంటే.. ఉసిరి పొడిలో సమాన పరిమాణంలో పసుపు కలపి, ఖాళీ కడుపుతో 1 టీస్పూన్‌ తీసుకోండి. ఈ పొడి రక్తంలో చక్కెర స్థాయని తగ్గిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *