మొక్కల ఆధారిత ఆహారాలు కొన్ని ముఖ్య ఆహార సమూహాలపై పరిమితులను కలిగి ఉన్నాయని అనుకోవడం వల్ల వెజిటేరియన్స్ ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల వినియోగం కోసం తగినంత ప్రోటీన్స్ ఫుడ్స్ కనుక్కోవడం కష్టమవుతుంది. జింక్, బి విటమిన్ల వంటి విటమిన్స్, ఖనిజాల శ్రేణికి ప్రోటీన్ మంచి మూలం. ఎక్కువ ప్రోటీన్ కండరాలను పెంచే ఫుడ్స్. అదే బరువుని తగ్గిస్తుంది. అయినప్పటికీ, బాగా ప్రణాళికాబద్దమైన మొక్కల ఆధారిత ఆహారం ప్రోటీన్‌తో సహా మీకు అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. మీ ఆహారంలో కొన్ని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ని చేర్చుకోవచ్చు.

​బాదంపప్పు..

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బాదం పప్పు ఎన్నో లాభాలను అందిస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు బాదంపప్పులో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ని అందిస్తుంది. వర్కౌట్ తర్వాత కండరాలకు బలాన్ని అందించడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. ఆకలిని నియంత్రించి, కేలరీలు తీసుకోవాలన్న ఆలోచనను తగ్గిస్తుంది. కాబట్టి వీటిని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్దీ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. విటమిన్ ఈ, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్, జింక్ మొదలైన 15 కీలకమైన పోషకాలు ఉంటాయి. బాదంపప్పులను వెజిటేరియన్స్ ప్రోటీన్‌కి మూలంగా వాడొచ్చు. మంచి విషయం ఏంటంటే.. బాదంపప్పులో ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు. హెల్దీ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

Also Read : Peanuts : పల్లీలు తింటే బరువు పెరుగుతారా..

​టోఫు..

వెజిటేరియన్స్‌కి టోఫు గుడ్ ఆప్షన్ కొత్త శాకాహారులు పనీర్, కాటేజ్ చీజ్ కొంతమంది తినడానికి ఇష్టపడరు. కాబట్టి, దీని బదులు టోఫు తినొచ్చు. ఇది పెరుగు సోయా పాలతో తయారవుతుంది. ప్రోటీన్‌కి మంచి మూలం. అదనంగా, ఇందులో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అలాగే ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, మాంగనీస్‌లు కూడా ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌కి మారాలనుకునేవారికి ఇది మంచి ఫుడ్. టోఫు ప్రోడక్ట్స్ వంటకాలలో హ్యాపీగా తీసుకోవచ్చు టోఫును ముక్కలుగా చేసి తురిమిన పాన్ ఫ్రైడ్, గ్రిల్ చేయొచ్చు.

Also Read : Romance and zodiac signs : ఈ రాశివారు శృంగారానికి బానిసలుగా మారతారట..

​పప్పు..

కాయధాన్యాలు, ప్రముఖంగా దాల్స్ తీసుకుంటారు. కందిపప్పు, ఎర్ర కందపప్పు, మినపపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటాయి. చాలా మంది ఇళ్ళల్లో పప్పులు చాలా ముఖ్యం. అయినప్పటికీ వాటిని వినియోగించే విధానం రాష్ట్రాల వారీగా మారుతుంది. ఇప్పటికీ పప్పులను చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది ఇళ్ళల్లో పప్పు ఉండాల్సిందే.

Also Read : Heart problems : ఈ ఎక్సర్‌సైజెస్ గుండెకి చాలా మంచివట..

​పప్పులతో ఏమేం చేయొచ్చు..

వీటిని చేయడం ఈజీ. రోటీ, ఇడ్లీ, దోశ మొదలైన వాటితో కలిపి వండొచ్చు. ఇవి మానవ శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్‌ని అందిస్తాయి. అయినప్పటికీ, అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్‌ని పొందేందుకు తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. పప్పును దాల్ తడ్కా, సాంబార్, దోశ, ఇడ్లీ, ఖిచ్డీ రూపాల్లో తీసుకోవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *