PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన HDFC బ్యాంక్; SBI, PNBతో పోలిస్తే ఏ బ్యాంక్‌ బెటర్‌?

[ad_1]

HDFC Bank FD Rates Hike: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC బ్యాంక్, తన ఖాతాదార్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల మీద వడ్డీ రేటును మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు (FD‌) ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ కాల పరిమితుల్లో, సాధారణ కస్టమర్‌లకు 3.00 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను బ్యాంక్‌ అందిస్తోంది. అదే సమయంలో… బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. కొత్త రేట్లు మంగళవారం (ఫిబ్రవరి 21, 2023) నుంచి అమలులోకి వచ్చాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన FDలపై బ్యాంక్ ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తోందంటే..? 

సాధారణ కస్టమర్లకు (రూ. 2 కోట్ల లోపు FDలపై) HDFC బ్యాంక్ ఇస్తున్న వడ్డీ:

7 నుంచి 14 రోజుల FD – 3.00%
15 నుంచి 29 రోజుల FD – 3.00%
30 నుంచి 45 రోజుల FD – 3.50%
46 నుంచి 6 నెలల వరకు  FD – 4.50 శాతం
6 నెలల నుంచి 9 నెలల వరకు FD – 5.75%
9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు FD – 6.00 శాతం
1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు FD – 6.60 శాతం
15 నెలల నుంచి 18 నెలల వరకు FD – 7.10 శాతం
18 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు FD – 7.00 శాతం

సాధారణ కస్టమర్లకు (రూ. 2 కోట్ల లోపు FDలపై) SBI ఇస్తున్న వడ్డీ:

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ  ఫిబ్రవరి 15, 2023న నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లలోపు (సాధారణ పౌరులు) ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దార్లకు 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 60 ఏళ్లు దాటినవారికి (సీనియర్ సిటిజన్లు) 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత, రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన FDలపై సాధారణ పౌరులకు స్టేట్‌ బ్యాంక్‌ ఇస్తున్న వడ్డీ రేట్లు…

7 నుంచి 45 రోజుల FD – 3.00%
46 నుంచి 179 రోజుల FD – 4.5%
180 నుంచి 210 రోజుల FD – 5.25%
211 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు FD – 5.75 శాతం
1 సంవత్సరం FD – 6.8 శాతం
400 రోజుల FD (అమృత్ కలశ్‌) – 7.10%
2 నుంచి 3 సంవత్సరాలకు FD – 7.00 శాతం
3 నుంచి 5 సంవత్సరాలకు FD – 6.5 శాతం
5 నుంచి 10 సంవత్సరాల వరకు FD – 6.5 శాతం

సాధారణ కస్టమర్లకు (రూ. 2 కోట్ల లోపు FDలపై) PNB ఇస్తున్న వడ్డీ:

పంజాబ్ నేషనల్ బ్యాంక్, తన ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ఫిబ్రవరి 20న ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల మీద వడ్డీని బ్యాంక్ పెంచింది. సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 3.50 శాతం నుంచి 6.50 శాతం వడ్డీ రేటును & సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం నుంచి 7.30 శాతం వరకు వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్ చేస్తోంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన FDలపై సాధారణ పౌరులకు ఈ బ్యాంక్‌ ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తుందో చూద్దాం.

7 రోజుల నుంచి 45 రోజుల FD – 3.50%
46 రోజుల నుంచి 179 రోజుల FD – 4.50%
271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు FD – 5.50%
1 సంవత్సరం నుంచి 665 రోజుల వరకు FD – 6.75%
666 రోజుల FD – 7.25%
667 రోజుల నుంచి 3 సంవత్సరాల FD – 6.75%
3 నుంచి 10 సంవత్సరాల వరకు FD – 6.50 శాతం

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *