ఫ్యాటీలివర్ సమస్యకి ప్రధాన కారణాలు

[ad_1]

అధ్యయనాన్ని చేయడానికి, ఫ్రాన్స్‌లోని పోయిటీర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఎలుకలకు రెండు వేర్వేరు ఫుడ్స్‌ని తినిపించారు.

​పరిశోధన ఇలా సాగింది..

సగం ఎలుకలకి 10 శాతం కంటే ఎక్కువ కొవ్వు లేని ఆహారం ఇచ్చారు. మిగిలిన వాటికి కేలరీల తీసుకోవడంలో 55 శాతం కొవ్వుని ఇచ్చారు. 16 వారాల తర్వాత, పరిశోధకులు వాటి కాలేయం, మెదడు పనితీరుపై రెండు గ్రూప్స్ వారీగా ఆహార ప్రభావాన్ని పరీక్షించారు. ఎక్కువ స్థాయిలో కొవ్వుని తినే ఎలుకలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య(NAFLD), ఇన్సులిన్ నిరోధకత, మెదడు పనిచేయకపోయే సమస్యలని కనుగొన్నారు. అదే విధంగా కూడా ఊబకాయం పెరుగుతుంది.

​పరిశోధకులు ఏం గుర్తించారంటే..

NAFLDని అభివృద్ధి చేయడంతో పాటు, ఈ గ్రూప్‌లోని ఎలుకలకి ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

NAFLDలో రక్త నాళాల సంఖ్య, వాటి ఆకృతి ప్రభావితమవుతుందని పరిశోధకులు గుర్తించారు. తక్కువ ఆక్సిజన్ పంపిణీతో, మెదడులోని కొన్ని కణాలు ఎక్కువ ఆక్సిజన్‌ని తీసుకుంటాయి.

మెదడుకి రక్త ప్రసరణ తగ్గడం, మానసిక సమస్యలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆక్సిజన్ లేమి చివరికి మెదడు కణాలను చంపుతుంది. ఇది అనేక లోపాలను కలిగిస్తుంది.

Also Read : Weight Loss Journey : మెట్లు ఎక్కి దిగడంతో 13 కిలోలు తగ్గాడట..

​ఫ్యాటీ లివర్‌ సమస్యతో..

డాక్టర్ అన్నా హడ్జిహంబి, ఈ అధ్యయన రచయిత… కాలేయంలో కొవ్వు పేరుపోవడం మెదడుపై చూపే ప్రభావాన్ని చూడడం చాలా ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యే ఇది తరచుగా తేలిగ్గా ప్రారంభమవుతాయి. ప్రజలు తమకు తెలియకుండానే చాలా ఈ సమస్యని భరిస్తూనే ఉంటారు. మన ఆహారంలో చక్కెర, కొవ్వు పరిమాణాన్ని తగ్గించడం బరువు పెరగడమే కాకుండా, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిరాశ, మానసిక సమస్యల్ని తగ్గిండమే కాకుండా కాలేయాన్ని కూడా రక్షిస్తుందని డాక్టర్ అన్నా హడ్జి హంబి చెబుతున్నారు.

Also Read : Romance stories : వీరంతా అందుకోసమే భర్తలను మోసం చేశారట..

​డెమెన్షియాకి ఏం సంబంధం..

న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన డెమెన్షియా ప్రమాదాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పరిశోధనల ప్రకారం తగినంత రక్త ప్రవాహం మెదడుకి వాస్కులర్ దెబ్బతినడానికి దారితీస్తుంది. దీని కారణంగా NAFLD, డెమెన్షియా మధ్య సంబంధం ఉంటుంది.

Also Read : Thyroid : థైరాయిడ్ ఉన్నవారు వీటిని తినకూడదట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *