[ad_1]
నేడు హైదరాబాద్లో బంగారం ధరలు ఇలా
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా పెరుగుతున్న బంగారం ధరల పరిస్థితి నేడు ఏ విధంగా ఉందంటే.. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సు కు 1944 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఇక అదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 23.85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో భారతదేశంలోనూ ధరల దూకుడుకు కళ్లెం పడడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 52,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,490 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన నగరాలలో నేడు బంగారం ధరలు
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో నేడు ప్రస్తుతానికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,850 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,650 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు ప్రస్తుతానికి 52,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57 వేల 490 రూపాయలుగా ఉంది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో 58,310 గా ఉంది కోయంబత్తూర్, మధురై లోను ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశం మొత్తం మీద చెన్నై, కోయంబత్తూరు, మధురై లో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి.
కొనసాగుతున్న బంగారం ధరల దూకుడు.. కొనుగోలుపై నిర్ణయం మీదే
ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలు దూకుడు మరింత కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 60 వేలకు బంగారం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, బంగారం కొనుగోలు విషయంలో పెరుగుతున్న ధరలను చూసి ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఏది ఏమైనా పసిడి ప్రియులకు చేదువార్తగా మారిన పెరుగుతున్న బంగారం ధరలు శాంతించేది ఎప్పుడో అని బంగారం ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
[ad_2]
Source link