నెల రోజుల కనిష్టానికి చేరిన బంగారం ధరలు
ప్రస్తుతం నెలరోజులు కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ధరలు మరింత తగ్గితే బాగుండని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

హైదరాబాద్, ఢిల్లీలలో బంగారం ధరలు ఇలా
ఇక తాజాగా బంగారం ధరల విషయానికొస్తే దేశీయంగా బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. నేడు దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700గా ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,510 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
నిన్నటికి ఈరోజుకి వంద రూపాయలు మేర బంగారం ధరలు తగ్గిన పరిస్థితి ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,950గా ప్రస్తుతం కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 56,610 గా ట్రేడ్ అవుతోంది.

విశాఖ, విజయవాడ, బెంగుళూరులలో బంగారం ధరలు నేడు ఇలా
ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,850 ప్రస్తుతం ధర పలుకుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 56,560 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో 51,700గా ట్రేడ్ అవుతుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో 56,510 రూపాయల వద్ద కొనసాగుతుంది.
ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700 ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,510గా కొనసాగుతుంది.

ముంబై, చెన్నై లలో బంగారం ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,700గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా కొనసాగుతుంది.ఇక దేశంలోనే బంగారం ధరలలో అత్యధిక ధరలను నమోదు చేసే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో బంగారం ధరలు నేడు చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,150 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది .
మొత్తంగా చూస్తే ప్రస్తుతం బంగారం ధరలు కిందికి చూస్తున్న పరిస్థితి పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. మరెందుకాలస్యం బంగారం కొనుగోలు చెయ్యాలి అని అని భావించేవారు ఇదే సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్న క్రమంలో బంగారం షాపులకు వెళ్లి నచ్చిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకోండి.