Friday, June 18, 2021

‘బంగ్లా’లో తారాస్థాయికి చేరిన హింస.. హిందూ దేవాలయాలు,రైళ్లపై దాడులు.. ఇప్పటివరకూ 13 మంది మృతి…

International

oi-Srinivas Mittapalli

|

బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ పెల్లుబికిన నిరసనలు ఆదివారం(మార్చి 28) తారాస్థాయికి చేరాయి. వందలాది మంది ఇస్లామిస్ట్ గ్రూప్ సభ్యులు హిందూ దేవాలయాలపై,రైళ్లపై దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం(మార్చి 28) నుంచి కొనసాగుతున్న ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ఇప్పటివరకూ 11 మంది మృతి చెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

శుక్ర(మార్చి 26),శనివారాల్లో(మార్చి 27) భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. బంగ్లాలో మోదీ పర్యటనను నిరసిస్తూ శుక్రవారం నుంచే నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్నాయి. భారత్‌లోని ముస్లింల పట్ల ప్రధాని మోదీ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఆందోళనకు దిగాయి.

Train, Temples Attacked As Bangladesh Clashes Spread After PM Modi Visit

ఆదివారం(మార్చి 28) వందలాది మంది ఇస్లామిస్ట్ గ్రూప్ సభ్యులు ఢాకా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనల్లో హెఫాజత్ ఇ ఇస్లామ్ అనే గ్రూప్ మద్దతుదారులు బ్రహ్మన్‌బరియాలో ప్యాసింజర్ రైలుపై దాడికి పాల్పడ్డారు.రైలు ఇంజిన్‌తో పాటు దాని కోచ్‌లన్నింటినీ వారు ధ్వంసం చేశారు. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బ్రహ్మన్‌బరియాకు చెందిన జావెద్ రహీమ్ అనే జర్నలిస్ట్ మాట్లాడుతూ… దేశంలోని పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలపై ఇస్లామిస్ట్ గ్రూప్స్ దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పలు హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారని,వాటిని తగలబెట్టారని తెలిపారు. ప్రస్తుతం తాము తీవ్ర భయాందోళనలో,నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు.

రాజ్‌షాహి జిల్లాలోని ఓ ప్రాంతంలోనూ ఆందోళనకారులు రెండు బస్సులను తగలబెట్టారు. చాలాచోట్ల పోలీసుల పైకి వారు రాళ్లు రువ్వారు. టింబర్,ఎలక్ట్రిక్ పోల్స్,ఇసుక బస్తాలతో రహదారులను దిగ్బంధించారు. మరోవైపు జరిగిన హింసకు పోలీసులదే కారణమని హెఫాజత్ ఇ ఇస్లామ్ సెక్రటరీ అజిజుల్ హక్ పేర్కొనడం గమనార్హం. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై అకారణంగా పోలీసులు కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు.

కాగా,బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన మోదీ… పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం తాను సత్యాగ్రహం కూడా చేశానని… ఆ కారణంగా జైలుకు కూడా వెళ్లానని చెప్పారు. అయితే మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ‘ఫేక్ న్యూస్’ అంటూ మోదీ వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు.


Source link

MORE Articles

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe