[ad_1]
వాషింగ్ మెషిన్‌లో వేసినప్పుడు..
నేటి బిజీ టైమ్‌లో చాలా మంది బట్టలు ఉతికేందుకు వాషింగ్‌మెషిన్‌నే ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేశాక వెంటనే తీసి ఆరేయాలి. అలానే ఉంచకూడదు. దీని వల్ల డ్రైయర్ వాటర్‌ని స్క్వీజ్ చేశాక అవి అలా ముడతలు పడినట్లుగా అయిపోతాయి. వాటిని అలానే ఎక్కువసేపు ఉంచితే అవి ఎక్కువగా అలానే ఉండిపోతాయి. కాబట్టి వెంటనే తీసేయాలి మిషిన్ నుంచి.
Also Read : Belly fat exercises : ఈ 6 ఎక్సర్‌సైజెస్‌తో బెల్లీ ఈజీగా తగ్గుతుందట..
ఆరవేసేటప్పుడు..
బట్టలు ఉతకడం మాత్రమే కాదు. ఆరవేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ఆరవేసేటప్పుడు ఎక్కువగా దులుపుతూ ఆరవేయాలి. తడిగా ఉన్నప్పుడే వీటిని ఇలా దులపడం వల్ల ఈజీగా ముడతలు పోతాయి. దీంతో పని కాస్తా సులభం అవుతుంది. మాములుగా చేతులతో పిండిన బట్టలకంటే మెషిన్‌లో వేసిన బట్టల్ని ఎక్కువగా దులిపి ఆరబెట్టాలి.
Also Read : Lower Back Pain : లోయర్ బ్యాక్ పెయిన్ ఈ కారణాల వల్లే వస్తుంది..
హెయిర్ డ్రైయర్..
అవును.. హెయిర్ డ్రెయర్స్‌ని కేవలం జుట్టు కోసమే కాదు, మీరు బట్టలపై ఉన్న ముడతలు పోగొట్టేందుకు కూడా వాడొచ్చు. ఎస్పెషల్లీ ఈ ఐడియా ఏదైనా ఊరెళ్ళినప్పుడు బాగా పనికొస్తుంది. ఊరెళ్ళినప్పుడు ఎలాగూ ఐరన్ బాక్స్ తీసుకెళ్ళం. కాబట్టి, ఇలాగా చక్కగా ముడతలు తీసేయొచ్చు. అయితే ముందుగా నీటిని స్ప్రే చేసి చేస్తే త్వరగా ముడతలు పోతాయి.
Also Read : Heart Valves : హార్ట్ వాల్వ్ పనిచేయకపోతే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..
వేడి నీటి గిన్నెతో…
అదే విధంగా, పాతకాలంలో ఐరన్ బాక్సులు లేని టైమ్‌లో చెంబులు, పాత్రల్లో వేడి నీరు పోసి ఐరన్ చేసేవారు. అదే పద్ధతి ఇప్పుడు కూడా వాడొచ్చు. దీని వల్ల ఎలాంటి శ్రమ కూడా ఉండదు. అయితే ఇలా చేసే ముందు ఆ పాత్రలు క్లీన్‌గా ఉన్నాయా, లేదా వాటి వల్ల ఏమైనా మరకలు పడుతాయా అనేది చెక్ చేసుకోని చేయడం మంచిది. వేడి ఎంత ఉండాలనేది మీరు హ్యాండిల్ చేసే దానిపై ఉంటుంది. అదే విధంగా వేడి నీటి గిన్నెపై స్టాండ్ పెట్టి మీ డ్రెస్‌ని దానిపై హ్యాంగ్ చేస్తే కూడా చాలా వరకూ మరకలు దూరమవుతాయి.
లాభాలు..
ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ బట్టలు ఐరన్ లేకుండా నీట్‌గా కనిపిస్తాయి. మీరు వీటిని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. వీటిని పాటించడం వల్ల కరెంట్ బిల్ కూడా కలిసొస్తుంది. మరి ఇంకేంటి మీరు వీటిని పాటించండి. హ్యాపీగా ముడతలు లేని బట్టలను వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా కరెంట్ ఉన్నా లేకపోయినా పాటించొచ్చు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు.
[ad_2]
Source link