[ad_1]
Stock Market Update: స్టాక్ మార్కెట్ దృష్టి నుంచి చూస్తే కేంద్ర బడ్జెట్‌కు ప్రాధాన్యం తగ్గిందని కొందరు ఎనలిస్ట్‌లు వాదిస్తున్నారు. అయితే, 2019 నుంచి చూస్తే.. బడ్జెట్‌కు నెల ముందు, బడ్జెట్ రోజు, ఆ తర్వాత నెల రోజుల వరకు సూచీలు అస్థిరంగానే కదులుతున్నాయి, విపరీతమైన స్వింగ్స్ నమోదు చేస్తున్నాయి.
గత నాలుగు సంవత్సరాల మార్కెట్ డేటా ప్రకారం… రెండు నెలల వ్యవధిలో (బడ్జెట్‌కు ఒక నెల ముందు, ఒక నెల తర్వాత), గత నాలుగు సంవత్సరాల్లో 3 సార్లు సెన్సెక్స్ (BSE Sensex) నెగెటివ్‌గా ముగిసింది. యూనియన్ బడ్జెట్‌కు నెల ముందు, నెల తర్వాత.. ఈ రెండు వైపులా మార్కెట్ భారీగా పడిపోయింది. 2019 జులై బడ్జెట్ సమయంలో, రెండు నెలల వ్యవధిలో ఈ ఇండెక్స్ 8.4% నష్టంతో ముగిసింది.
సెన్సెక్స్ – బడ్జెట్ లెక్కలివి:
బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: జులై 5, 2019
బడ్జెట్‌కు నెల ముందు సెన్సెక్స్: 40,084
బడ్జెట్ తేదీన సెన్సెక్స్: 39,513
బడ్జెట్‌కు నెల తర్వాత సెన్సెక్స్: 36,700
బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: ఫిబ్రవరి 1, 2020
బడ్జెట్‌కు నెల ముందు సెన్సెక్స్: 41,306
బడ్జెట్ తేదీన సెన్సెక్స్: 39,736
బడ్జెట్‌కు నెల తర్వాత సెన్సెక్స్: 38,297
బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: ఫిబ్రవరి 1, 2021
బడ్జెట్‌కు నెల ముందు సెన్సెక్స్: 47,869
బడ్జెట్ తేదీన సెన్సెక్స్: 48,601
బడ్జెట్‌కు నెల తర్వాత సెన్సెక్స్: 49,850
బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: ఫిబ్రవరి 1, 2022
బడ్జెట్‌కు నెల ముందు సెన్సెక్స్: 58,254
బడ్జెట్ తేదీన సెన్సెక్స్: 58,863
బడ్జెట్‌కు నెల తర్వాత సెన్సెక్స్: 56,247
బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ ప్రకారం.. 2019 నుంచి బడ్జెట్ డే నాడు స్టాక్ మార్కెట్‌లో అస్థిరత పెరిగింది. 2022లో కనిపించిన ఓలటాలిటీ గత 11 సంవత్సరాల బడ్జెట్ సమయాల కంటే ఎక్కువగా ఉంది.
“బడ్జెట్ తర్వాతి 30 రోజులను లెక్కలోకి తీసుకుంటే, ప్రతి మూడు సంవత్సరాల్లో రెండు సార్లు మార్కెట్ పడిపోయింది. బడ్జెట్ కంటే ముందు 30 రోజుల్లో మార్కెట్ పెరిగినట్లయితే, బడ్జెట్ తర్వాత పతనమయ్యే అవకాశం 80% వరకు ఉంది. గత 30 సంవత్సరాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే బడ్జెట్‌కు ముందు, ఆ తర్వాత మార్కెట్ పెరిగింది” – మోర్గాన్ స్టాన్లీ
ఈ సంవత్సరం జనవరిలో ఇప్పటి వరకు, యూనియన్ బడ్జెట్‌ను స్టాక్ మార్కెట్ తక్కువగా ట్రాక్ చేసింది. ఇదే ధోరణి బడ్జెట్ రోజు వరకు కొనసాగితే, మార్కెట్ మనల్ని సానుకూలంగా ఆశ్చర్యపరిచే (మార్కెట్ ర్యాలీకి) అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్ అంచనా వేసింది.
నిఫ్టీ విషయానికి వస్తే… 5 సంవత్సరాల్లో, బడ్జెట్ తర్వాత నెలల్లో సగటున 2.8% పడిపోయింది.
2024లో సాధారణ ఎన్నికలకు ముందు ఇదే చివరి బడ్జెట్ కాబట్టి… కాపెక్స్, రూరల్ ఇండియా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులతో పాటు మరికొన్ని ప్రధాన ప్రాజెక్ట్ ప్రకటనలను బడ్జెట్‌లో వినే అవకాశం ఉందని ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ చెబుతున్నారు. REC, PFC వంటి బడ్జెట్‌తో సంబంధం ఉన్న స్టాక్స్; IRB, GMR ఇన్‌ఫ్రా వంటి ఇన్‌ఫ్రా స్టాక్స్; రైల్‌టెల్, RITES, IRFC, IRCON వంటి రైల్వే స్టాక్స్, ఎరువుల స్టాక్స్ ఇకపై ర్యాలీ చేస్తాయని అంచనా వేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link