‘బయ్‌’ రేటింగ్‌తో ఐచర్‌ మోటార్స్‌ రైజ్‌! నిఫ్టీ, సెన్సెక్స్‌ ఫ్లాట్‌

[ad_1]

Stock Market Opening 26 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) అర పాయింటు పెరిగి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 47 పాయింట్లు తగ్గి 65,976 వద్ద కొనసాగుతున్నాయి. జెఫరీస్‌ బయ్‌ రేటింగ్‌ ఇవ్వడంతో ఐచర్‌ మోటార్స్‌ షేర్లు 4 శాతం పెరిగాయి. విలువైన లోహాల ధరలు తగ్గాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,023 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,071 వద్ద మొదలైంది. 65,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 47 పాయింట్లు తగ్గి 65,976 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,682 వద్ద ఓపెనైంది. 19,649 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,699 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం అర పాయింటు పెరిగి 19,674 వద్ద కొనసాగుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ తగ్గింది. ఉదయం 44,722 వద్ద మొదలైంది. 44,610 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 102 పాయింట్ల నష్టంతో 44,722 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఎన్టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస సూచీలు కొంత పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.59,730 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 తగ్గి రూ.24,190 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆఖర్లో సెంటిమెంటు బలపడటంతో లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) అర పాయింటు పెరిగి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు మాత్రం ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *