చెమటలు కక్కేలా వర్కౌటస్ చేస్తుంటారు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంటారు. అలా చేసినా బరువు తగ్గరు. అలాంటప్పుడు ఈజీ స్టెప్స్ ఫాలో అవుదామని ట్రై చేస్తుంటారు. అందులో చాలా వరకూ ఇంటి చిట్కాలు ఉంటాయి. అలాంటి ఇంటి చిట్కాల్లో ఒకటి, చాలా పాపులర్ అయిన ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం. దీని వల్ల చాలా పాజిటీవ్ రిజల్ట్స్ ఉంటాయని చెబుతారు నిపుణులు. అది ఏంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

​అవిసెల్లోని పోషకాలు..

అవిసె గింజల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటితో పాటు మినరల్స్, థయామిన్, కాపర్, మెగ్నీషియమ్, ఫాస్పరస్, ఫెరూలిక్ యాసిడ్, సినోజెనిక్ గ్లైకోసైడ్స్, ఫైటోస్టెరోల్స్, లిగ్నాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

Also Read :Ideal Weight : మీ సరైన బరువు ఎలా చూసుకోవాలంటే..

​బరువు తగ్గడం..

త్వరగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా వరకూ బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. జీవక్రియను వేగంగా చేసి బరువు తగ్గేందుకు ఇవి సాయపడతాయి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో ప్రోటీన్ ఫుడ్‌కి మించినది మరొకటి ఉండదు. 100 గ్రాముల విత్తనాల్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ మాక్రో న్యూట్రియెంట్ కణాలను, కండరాలకి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. వీటిని తినడం జంక్ ఫుడ్ తినకుండా కంట్రోల్ చేస్తుంది. రోజులో ఓ టీ స్పూన్ అవిసె గింజలన ఎలా తీసుకున్నా బరువు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దీనిని పౌడర్‌లా చేస్తే చాలా మంచిది.

​కొలెస్ట్రాల్ దూరం..

ముందుగా చెప్పుకున్నట్లు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. చాాలా సమస్యలు అధిక కొవ్వు కారణంగానే వస్తాయి. ఈ గింజల్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. ఇక హైబీపితో బాధపడేవారు కూడా వీటిని తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ డయాబెటిస్ కూడా తగ్గుతుంది.

Also Read : Beetroot Benefits : బీట్‌రూట్ తింటే బీపి కంట్రోల్‌లో ఉంటుందా..

​ఫ్లాక్స్ సీడ్స్ టీ..

కావాల్సిన పదార్థాలు..

  • ఓ గ్లాసు నీరు
  • అవిసెగింజలు 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
  • బెల్లం 1 టేబుల్ స్పూన్..

తయారీ విధానం..

ఓ గిన్నెలో నీరు పోసి ఫ్లాక్స్ సీడ్స్ వేయండి వాటిని 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించండి. మంటను ఆపివేసి కాసేపు చల్లార్చి నిమ్మరసం, బెల్లాన్ని కలిపి తాగండి.

Also Read : After Romance : శృంగారం చేస్తే తలనొప్పి వస్తుందా.. జాగ్రత్త..

​ఎలా తీసుకోవచ్చు..

అవిసెగింజలు.. నిజానికీ ఇవి ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి. ఇందులోని పోషకాలు గురించి తెలుసుకుని చాలా మంది వీటిని తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. పొడి రూపంలో, వీటిని అనేక రెసిపీస్‌ల్లా చేసుకుని వాటి ప్రయోజనాలు పొందుతున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

​తినే ముందు..

లోబిపి, బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నవారు, మలబద్ధకం, అతిసారం, హార్మోన్ల సమస్యలు, రక్తస్రావం సమస్యలు ఉన్నవారు వీటిని తినేటప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి. మిగతావారు కూడా తమకి ఇవి సూట్ అవుతాయో లేదో చూసి తీసుకోవడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *