బాలయ్య వర్సెస్ పవన్.. అఖండ తాండవమో.. ఓజీ ఊచకోతా..!

Date:

Share post:


నందమూరి నట‌సింహం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య నట తాండవం చూడడానికి అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో.. సర వేగంగా షూట్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న అఖండ తాండవం రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా టీం ప్రకటించారు. కానీ.. ఇప్పుడు అనుకున్న టైంకి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ నడుస్తుంది. మేకర్స్‌ పక్కగా రిలీజ్ అవుతుంది అని చెప్తున్నా.. దసరా నుంచి అఖండ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.

దీంతో.. అఖండ ప్లేస్‌లో ఓజీ రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీపై ఆడియన్స్‌లో.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం ఫైనల్స్ షెడ్యూల్‌ను శ‌ర‌వేగంగా జరుపుకుంటుంది. ఈ స్కెడ్యూల్‌తో ఓజీ షూటింగ్ పూర్తి అయిపోతుంది. దీంతో.. వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి.. రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ 2 పోస్ట్‌పోన్ అయితే.. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ చేసే ఆలోచనలో టీం ఉన్నారట.

ఒకవేళ అఖంట 2 రేస్‌లో ఉన్నా.. ఓజీ మాత్రం రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే.. బాలయ్య వర్సెస్ పవన్ బాక్సాఫీస్ వార్‌కు అవకాశాలు చాలా రేర్‌గా కనిపిస్తున్నాయి. కాబట్టి.. రెండు సినిమాల్లో ఏదో ఒకటి దసరా బ‌రిలో కచ్చితంగా సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది దసర‌కు.. ఓజి ఊచ‌కోత ఉంటుందా.. లేదా అఖండ తాండవం చూస్తామా.. వేచి చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం పవన్ వర్సెస్ బాలయ్య మధ్యన పోటీ ఆడియన్స్ లో మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి డేసిషన్ తీసుకుంటారు వేచి చూడాలి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...

హీరో కాక‌పోతే క‌చ్చితంగా అదే చేసేవాడ్ని: మంచు విష్ణు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. 1985లో విడుదలైన `రగిలే గుండెలు` సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా...