టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగా, నందమూరి వార్ ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్లాష్‌లు ఆడియన్స్‌లోను ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలా.. ఇప్పటికే ఎన్నో సంక్రాంతిల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి వార్ మనం చూసాం. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, గేమ్ ఛేంజర్ సినిమాతో.. బాలయ్య, డాకు మహారాజ్‌కి పోటీగ దిగాడు. కాగా.. ఇలా ఇప్పటివరకు ఎన్నో మెగా, నందమూరి బాక్సాఫీస్ వార్ కొనసాగిన.. నెక్స్ట్ జరగనున్న మెగా వర్సెస్ నందమూరి వార్ మాత్రం వీటన్నింటిని మించి.. వేరే లెవెల్ లో ఉండనుంది.
అయితే ఈ ఏడాది సంక్రాంతికి కాదు.. దసరాకే మరోసారి మెగా, నందమూరి సినిమాల మధ్య పోటీ నెలకొంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ వస్తున్నాడు అంటే.. ఆ డేట్‌కు ఫిక్స్ అయిన బాలయ్య మూవీ అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందని అంత భావించారు. కానీ.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌తో అదే రోజున మూవీ వస్తున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పక్కాగా.. సినిమా ఆ రోజే రానుందని ఫ్యాన్స్ కు కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రిత్యా బాలయ్య వర్సెస్ పవన్ వార్ మొదలైతే మాత్రం అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో పొత్తుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. ఈ క్రమంలో బాలయ్య, పవన్ మధ్యన సినిమాలతో వార్ అంటే ఇద్దరు అభిమానుల మధ్యన వార్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. పవన్, బాలయ్య ఒకరి సినిమాలతో ఒకరు తలపడితే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక హీరో సినిమాలపై.. మరో హీరో ట్రోల్స్ చేసుకుంటూ రెండు సినిమాలను ముంచేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఏడాది దసరా బరిలో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా నెగ్గుతుందో.. ఏ సినిమా తగ్గుతుందో వేచి చూడాలి.