బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Date:

Share post:


ఆశ్రిత వేమగంటి( Ashrita Vemaganti ).ఈ పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ బాహుబలి 2 సినిమా( Bahubali 2 movie
) అనుష్క వదిన క్యారెక్టర్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

 Ashrita Vemuganti About Age And Baahubali Experience, Ashrita Vemuganti, Baahuba-TeluguStop.com

సినిమాలో కుంతల రాజ్యానికి అనుష్క దేవసేన యువరాణిగా ఉంటుంది.ఇక అందులో దేవసేనకు వదిన పాత్రలో నటించింది.

ఈ పాత్రతో బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత ఆమెకు మళ్లీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

అయితే సినిమాలో దేవసేన వదిన పాత్రలో నటించిన ఆమె వయసు పెద్ద వయసు ఏమి కాదు.ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే.

స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది.ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే.కానీ కాస్త పెద్దదానిలా చూపించారు.

దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు.అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను.

చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు.ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు.

Telugu Baahubali, Tollywood-Movie

ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను.ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు.సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఆశ్రిత స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్.బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది.

తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి...

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు...

మహేష్ సినిమా విషయంలో మౌనంగా జక్కన్న.. ఈ స్టార్ డైరెక్టర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి ( Superstar Mahesh Babu, Director Rajamouli )కాంబినేషన్లో ఒక సినిమా...

పహల్గాం దాడి-భారత్‌ స్పందన – Navatelangana

- Advertisement - మే ఏడవ తేదీ అర్ధరాత్రి తర్వాత భారత సైనిక దళాలు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌ భూభాగంలోని తొమ్మిది టెర్రరిస్టు...