Tuesday, August 3, 2021

బిగ్ ట్విస్ట్-థర్డ్ ఫ్రంట్‌పై ప్రశాంత్ కిశోర్ అనూహ్య వ్యాఖ్యలు- అసలు పీకే మదిలో ఏముంది…?

India

oi-Srinivas Mittapalli

|

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వేస్తున్న అడుగులు,ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన కుదరడం లేదు.ఓవైపు శరద్ పవార్‌తో భేటీ… ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా కదులుతూనే… మరోవైపు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. చెప్పడమే కాదు… అసలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్,ఫోర్త్ ఫ్రంట్ లాంటివేవీ బీజేపీని ఢీకొట్టలేవని అంటున్నారు. దీంతో అసలు ప్రశాంత్ కిశోర్ వ్యూహమేంటి.. ఆయన మదిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది.

తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించగలదని నేనైతే భావించట్లేదు. థర్డ్ ఫ్రంట్ అనేది పాత కాన్సెప్ట్.ఇప్పటికే ఆ మోడల్‌ను ప్రయోగించడం,పరీక్షించడం జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితులకు ఆ మోడల్ సరిపోదు.’ అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

పవార్‌తో వరుస భేటీలపై స్పందిస్తూ… గతంలో తాము కలిసి పనిచేయనందునా… ఒకరి గురించి మరొకరం మరింత తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా కలుసుకున్నామని చెప్పారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా చర్చించామన్నారు. రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ బీజేపీని ఎలా ఎదుర్కోగలమో… ఎక్కడెక్కడ బీజేపీని ఎదుర్కోవడం సాధ్యపడదో వంటి అంశాలపై చర్చించామన్నారు. థర్డ్ ఫ్రంట్ తరహా మోడల్ గురించి ఇప్పటికైతే తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రశాంత్ కిశోర్ సోమవారం(జూన్ 21) భేటీ అవడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పైనే వీరిద్దరు చర్చించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. మంగళవారం(జూన్ 22) విపక్ష పార్టీలతో సమావేశానికి శరద్ పవార్ పిలుపునివ్వడం దీనికి మరింత బలం చేకూర్చింది. కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ కసరత్తులన్నీ జరుగుతున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే థర్డ్ ఫ్రంట్ మోడల్ ఇప్పటి పాలిటిక్స్‌కు సెట్ అవదని ప్రశాంత్ కిశోర్ ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. అంటే,పీకే థర్డ్ ఫ్రంట్‌ కాకుండా మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం సమాలోచనలు జరుపుతున్నారా… అసలు ఆయన మదిలో ఏముందన్నది సస్పెన్స్‌గా మారింది.

మరోవైపు శరద్ పవార్ అధ్యక్షతన రేపు విపక్షాల భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. బీజేపీ లక్ష్యంగా విపక్షాలను ఏకం చేసేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

English summary

Election Strategist Prashant Kishor said he believes that the ‘tried and tested’ Third Front model is archaic, and not suited to the current political dynamic. The political strategist went on to say that he does not believe that a third or fourth front can challenge the BJP in the 2024 Lok Sabha elections.


Source link

MORE Articles

Remove the blackness of underarms: किचन में रखी इन चीजों से चुटकियों में हटेगा अंडरआर्म्स का कालापन, जानिए आसान तरीका

how to remove dark underarms: ज्यादातर महिलाएं अंडरआर्म्स का कालापन (blackness of underarms) छिपाने के लिए बिना आस्तीन के कपड़े पहनने से बचती...

Singapore accelerator Iterative selects 10 startups for its Summer 2021 cohort

The startups in the batch will receive US$150,000 in funding in exchange of a 10% stake. Source link

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

భారత హాకీకి మంచి రోజులు భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత...

మోడీకి అండగా కేసీఆర్, నోరెత్తని టీఆర్ఎస్: అందుకే తెలంగాణకు అన్యాయమంటూ రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదని, అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా...

Benefit of banana health: रोज 1 केला सेहत के लिए कर सकता है कमाल, बस जान लीजिए सेवन का सही टाइम

benefit of banana health: आज हम आपके लिए केला के फायदे लेकर आए हैं. केला सबसे ज्यादा एनर्जी देने वाला फल है. खास...

Wife: అదే విషయంలో గొడవలు, ఏంచేస్తావు అని ఎదురు తిరిగిన భార్య, స్పాట్ లో చంపేసిన భర్త !

బెంగళూరులో కాపురం ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో సయ్యద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సయ్యద్, బేబి అయోషా అే...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe