News
lekhaka-Bhusarapu Pavani
Nourish You: ఇటీవల దేశంలో స్టార్టప్ కంపెనీలు ఎంత వేగంగా తమ వ్యాపారాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే అనూహ్యంగా వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు సినీ తారలు, క్రీడాకారులు వంటి సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇది సదరు కంపెనీల బ్రాండ్ ఇమేజ్ మార్కెట్లో పెరగటానకి కూడా దోహదపడుతోంది.
ఈ క్రమంలో బాలీవుడ్ సినీ తారలు గతంలో నైకా వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు సైతం తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు. దీంతో ఆమె సైతం ఇన్వెస్టర్‌గా మారి స్టార్టప్ కంపెనీలకు సహాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు నటిగా తెరమీద కనిపించిన సమంతాను తాజాగా అందరూ బిజినెస్ ఉమెన్‌గా చూస్తున్నారు. కెరీర్ లో మంచి స్వింగ్ మీదున్న సమంత ఇప్పుడు కొత్త తరం వ్యాపార ఆలోచనల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ప్లాంట్-బేస్డ్, శాకాహార లాక్టోస్ లేని పాల ప్రత్యామ్నాయాలను తయారు చేస్తున్న స్టార్టప్ కంపెనీ ‘నోరిష్ యూ’ కంపెనీలో వాటాదారుగా మారారు. ఈ సందర్భంగా సమంత కంపెనీకి చెందిన Millet Mlk ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేశారు. దేశంలో స్వదేశీ క్వినోవా, చియా గింజలను రిటైల్ చేయడంలో మొదటిది, స్థానికంగా లభించే, స్థిరమైన సూపర్‌ఫుడ్‌లను ప్రోత్సహించడంలో ‘నోరిష్ యూ’ ముందుంది.
Yasss!! 💪🏼@NourishYouIndia https://t.co/VqfUlxNhHA
— Samantha (@Samanthaprabhu2) March 29, 2023
నోరిష్ యూ సంస్థ ఈ ఏడాది జనవరిలో దాదాపు 2 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.16.5 కోట్ల సీడ్ ఫండింగ్ పొందింది. ఈ క్రమంలో నటి సమంత సైతం కంపెనీలో కొంత మెుత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని సంస్థ సహవ్యవస్థాపకుడు కృష్ణా రెడ్డి వెల్లడించారు. అయితే సమంత ఎంత మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. అయితే కంపెనీ పురాతన ఆహార జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి, స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆహారపు పద్ధతులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.
English summary
South Indian Heroine Samantha invested in indian food startup Nourish you launched Millet Mlk
South Indian Heroine Samantha invested in indian food startup Nourish you launched Millet Mlk
Story first published: Thursday, March 30, 2023, 21:55 [IST]