Friday, June 18, 2021

బిహార్ అసెంబ్లీలో రచ్చ.. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి? ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్న ఆర్జేడీ…

స్పీకర్ ఛాంబర్‌ను చుట్టుముట్టడంతో…

సాయంత్రం సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్‌ వద్దకు నిరసన తెలిపారు. ఆయన్ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ఆదేశాలతో పోలీసులు,మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని అసెంబ్లీ నుంచి బయటకు లాక్కెళ్లారు. అయితే ఈ క్రమంలో విపక్ష ఎమ్మెల్యేలపై దాడి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ ఎమ్మెల్యేలను కొట్టారని ఆర్జేడీ ఆరోపిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా పలు వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఒక వీడియోలో అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే ఒకరు సొమ్మసిల్లి పడిపోవడం… మహిళా పోలీసులు ఆమెను బయటకు లాక్కెళ్తుండటం కనిపిస్తోంది.

ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు : ఆర్జేడీ

మరో వీడియోలో… కిందపడిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను స్ట్రెచర్‌లో తరలిస్తుండటం గమనించవచ్చు. తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎస్పీ తన ఛాతిపై బలంగా కొట్టాడని… ఎమ్మెల్యేలపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఎమ్మెల్యే సత్యేంద్ర కుమార్ ఆరోపించారు. ‘స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ నేత్రుత్వంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వగా… పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. తేజస్వి యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్జేడీ చేపట్టిన నిరసన ర్యాలీలో కొన్ని అసాంఘీక శక్తులు చొరబడి హింసకు పాల్పడ్డారని ఆ పార్టీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆ చట్టం అమలులోకి వస్తే…

‘స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’ చట్టాన్ని బిహార్ విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దీనిపై తేజస్వి యాదవ్ మాట్లాడుతూ… ఈ చట్టం గనుక అమలులోకి వస్తే వారెంట్ లేకుండానే సోదాలు చేసే అధికారం పోలీసులకు వస్తుందన్నారు. అదే జరిగితే… ఎవరిపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అరెస్ట్ చేస్తారని అన్నారు. అలాంటప్పుడు కోర్టులు,మెజిస్ట్రేట్లతో ఇక పని ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తేజస్వి డిమాండ్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




Source link

MORE Articles

Delivery service Gopuff acquires rideOS for $115 million – TechCrunch

On-demand goods, food and alcohol delivery service Gopuff has acquired fleet management platform rideOS for $115 million, sources familiar with the deal say. This...

Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them to recommend its products to fellow LAPD...

Johana Bhuiyan / Los Angeles Times: Report: Ring provided at least 100 LAPD officers with free devices or discount codes and encouraged them...

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe