Tuesday, September 21, 2021

బీజేపీని దెబ్బతీసేలా బెంగాల్‌కు రైతు ఉద్యమం -టికాయత్ వార్నింగ్ -పెట్రోల్ పెంపు, పంటలకు ధర ఇవ్వరా?

National

oi-Madhu Kota

|

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీ రాజకీయంగా దెబ్బయిపోతోందనడానికి పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలను రుజువుగా భావిస్తోన్న తరుణంలో.. ఇంకొద్ది రోజుల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా రైతు ఉద్యమ ప్రభావం తప్పదని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల రాష్ట్రాల్లో భారీ ర్యాలీలతో సత్తా చాటుతామంటూ నేతలు సవాళ్లు విసురుతున్నారు..

ఫేస్‌బుక్ సంచలనం: వార్తా సేవలు బంద్ -మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలన్న చట్టాన్ని నిరసిస్తూ..

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు గురువారం నాటికి 85రోజులు పూర్తయ్యాయి. రైతులు, కేంద్రం మధ్య ఇప్పటికే 10 దఫాల చర్చలు విఫలం కాగా, జనవరి 26నాటి హింస తర్వాత చర్చల ప్రక్రియ సైతం నిలిచిపోయింది. కేంద్రం, రైతు సంఘాలు ఏ దశలోనూ కాంప్రమైజ్ కు సిద్ధంగా లేకపోవడంతో ఆందోళనలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామంటోన్న రైతులు గురువారం దేశవ్యాప్త రైల్ రోకోను చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పలు రాష్ట్రాల పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే..

fuel prices gone up but Crops prices not, will take our tractors Bengal, warns Rakesh Tikait

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం ఏకీభవించకపోతే నిరసనల్ని తీవ్ర తరం చేస్తామని, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌కు ఆందోళనలను తీసుకెళతామని, బెంగాల్ లో భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీలు తీసి సత్తా చాటుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. అంతేకాదు..

పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీ ఎత్తున పెంచేసిన కేంద్ర సర్కారు.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి మాత్రం సంకోచిస్తున్నదని, ధాన్యం రేట్లు పెంచాలన్న ఆలోచన కూడా వారికి రావడం లేదని టికాయత్ అన్నారు. కేంద్రం కావాలనే వ్యవసాయాన్ని నాశనం చేస్తోందని, ఆ విధానాలను తాము ఎంతమాత్రమూ సహించబోమని ఆయన అన్నారు. హర్యానాలోని పునియాలో గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో మాట్లాడుతూ టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదే -ప్రధాని మోదీ ఫైర్ -ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆశ్చర్యం

”పంటలు కోతకు వచ్చాయని రైతులు వెనక్కి వెళ్తారనే అపోహ నుంచి కేంద్రం బయటికి రావాలి. వాళ్లు మొండిగా ఉన్నంత కాలం మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే మా పంటను తగలబెడతాం కానీ ఇక్కడి నుంచి కదలం. రెండు నెలల్లో నిరసన ముగుస్తుందనే అపోహలు కూడా మానుకుంటే మంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచే కేంద్రం ధాన్యానికి ఎందుకు ధర పెంచదు? కేంద్రం పరిస్థితిని ఇంక జఠిలం చేయాలని చూస్తే బెంగాల్‌కు ట్రాక్టర్లు తీసుకుని వస్తాం. బెంగాల్‌లో కూడా రైతులకు మద్దతు ధర లభించడం లేదు” అని టికాయత్ అన్నారు.


Source link

MORE Articles

Alzheimer’s Disease: इस लाइलाज बीमारी की शुरुआत में मिलने लगते हैं ये संकेत, तुरंत उठाएं ये कदम

Alzheimer's Day: 21 सितंबर को पूरे विश्व में वर्ल्ड अल्जाइमर डे (World Alzheimer's Day 2021) के रूप में मनाया जाता है. यह एक...

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe