బీట్‌రూట్ అనగానే.. బాబోయ్ ఎలా తినాలిరా బాబూ అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని వండే విధంగా వండి తింటే చాలా బావుంటుంది. అంతే కాదండోయ్ శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్స్‌ని అందిస్తుంది. దీనిని తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

​కేలరీలు తక్కువ..

బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా ఇందులో శరీరానికి అవసరమైన దాదాపు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా ఫోలేట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో పాటు మాంగనీస్ ఉంటుంది. ఎముకల నిర్మాణం, బ్రెయిన్‌ హెల్త్‌కి చాలా మంచిది. ఈ బీట్‌రూట్‌లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల మీరు బరువు పెరుగుతారనే భయం లేదు. వీటితో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

Also Read : After Romance : శృంగారం చేస్తే తలనొప్పి వస్తుందా.. జాగ్రత్త..

బీపీ దూరం..

బీపి కారణంగా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు.. అయితే అధ్యయనాల ప్రకారం బీట్‌రూట్ రసం సిస్టోలిక్, డయాస్టోలిక్ రెండింటి స్థాయిలను తగ్గిస్తాయని తేలింది. ఈ బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో డైటరీ నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి. ఇది రక్తనాళాలకు వెళ్ళి రక్తపోటు స్థాయిలు పడిపోవడానికి కారణమయ్యే అణువు. ఈ దుంపల్లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. అయితే రక్తపోటుపై దుంపల ప్రభావం శాశ్వతంగా కాదు. తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

​జీర్ణ సమస్యలు దూరం..

బీట్‌రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గట్ హెల్త్‌కి చాలా మంచిది. మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు రెగ్యులర్‌గా బీట్‌రూట్ తినడం మంచిది. ఇలా చేయడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం ఇతర సమస్యలు రావు.

Also Read : Scarf styles : చలిలో స్కార్ఫ్‌ని ఇలా వేసుకోండి..

​బ్రెయిన్ హెల్త్..

వయస్సుతో పాటు కొన్నిసార్లు జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. వీటితో పాటు డెమెన్షియా వంటి న్యూరోడెజెనరేటివ్ సమస్యలు వస్తాయి. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఇందులోని నైట్రేట్స్ రక్తనాళాల విస్తరణను ప్రోత్సహించడంతో మెదడు పనితీరు మెరుగ్గా మారుతుంది.

Also Read : Pongal Rangoli : ముగ్గులు అందంగా కనిపించాలంటే ఇలా వేయండి..

ఎలా తీసుకోవచ్చు..

ఇన్ని లాభాలు ఉన్న బీట్‌రూట్‌ని నేరుగా ముక్కలుగా తినడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. దీంతో పాటు పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. అలానేజ్యూస్‌లా చేసి తీసుకోవచ్చు. లేదా సలాడ్‌లా తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిలోని గొప్ప మూలకాలు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి. అయితే, వీటిని తినే ముందు మీ హెల్త్ కండీషన్‌ని పరీక్షించుకుని మీ డాక్టర్‌ని కలిసి అతని సలహాతో ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుని తినడం మంచిది. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర సడెన్‌గా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మితంగా తీసుకోవడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *